Telugu Global
National

5గురుCMలు,17 మంది కేంద్రమంత్రులు,100మంది MPల ప్రచారం... అయినా తప్పని BJP ఓటమి

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ఒక పెద్ద రాష్ట్ర శాసన సభ ఎన్నికలను తలపించే విధంగా చేసింది బీజేపీ. ఎలా గైనా మున్సిపల్ పీఠంపై మళ్ళీ కూర్చోవాలనే పట్టుదలతో ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రణాళికలు రచించింది. అయినా ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో అవమానకర రీతిలో ఓటమికి గురయ్యింది.

5గురుCMలు,17 మంది కేంద్రమంత్రులు,100మంది MPల ప్రచారం... అయినా తప్పని BJP ఓటమి
X

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో 15 ఏళ్ళుగా అధికారం చలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ సారి కూడా మళ్ళీ గెలిచేందుకు చేయని ప్రయత్నం లేదు. ప్రజలపై అనేక రకాల వరాలను కురిపించడమే కాక ప్రచార రంగంలోకి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో సహా మొత్తం 5గురు CMలు, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌లతో సహా17 మంది కేంద్రమంత్రులు,100మంది MPలను దించింది బీజేపీ అగ్రనాయకత్వం.

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ఒక పెద్ద రాష్ట్ర శాసన సభ ఎన్నికలను తలపించే విధంగా చేసింది బీజేపీ. ఎలా గైనా మున్సిపల్ పీఠంపై మళ్ళీ కూర్చోవాలనే పట్టుదలతో ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రణాళికలు రచించింది. అయినా ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో అవమానకర రీతిలో ఓటమికి గురయ్యింది.

15 ఏళ్ళుగా బీజేపీ ఢిల్లీలో చేసిన అభివృద్దిని, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను పోల్చి చూసుకొని ప్రజలు ఓట్లు వేసినట్టు అర్దమవుతోంది. అందుకే ఢిల్లీ రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే మున్సిపల్ కార్పోరేషన్ లో మరో పార్టీని గెలిపించే సాంప్రదాయానికి ఈ సారి ఢిల్లీ ప్రజలు చెరమగీతం పాడారు.

ఇదే విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా బుధవారం మాట్లాడుతూ, ఈరోజు, ఒక చిన్న పార్టీ, పేద, నిజాయితీ మరియు విద్యావంతులైన పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని ఓడించిందని అన్నారు.

" బీజేపీ తరపున ఏడుగురికి పైగా ముఖ్యమంత్రులు, 17 మందికి పైగా కేంద్ర మంత్రులు, 100 మందికి పైగా ఎంపీలు ప్రచారం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖ, జైలులో ఉన్న ఓ దోపిడి దొంగ‌ [సుకేష్ చంద్రశేఖర్]ను బీజేపీ తన స్టార్ క్యాంపెయినర్లుగా చేసింది.అరవింద్ కేజ్రీవాల్‌ను ఎలాగైనా ఆపాలనుకున్నారు. కానీ ఢిల్లీ ప్రజలు ఆయనకు ఢిల్లీ ప్రభుత్వాన్ని అప్పగించినట్టే ఈ రోజు మునిసిపల్ కార్పొరేషన్ ను కూడా అప్పగించారు. "అని చద్దా అన్నారు.

First Published:  7 Dec 2022 3:23 PM GMT
Next Story