Telugu Global
National

36 వేల మంది టీచ‌ర్ల తొల‌గింపున‌కు హైకోర్టు ఆదేశాలు

టీచ‌ర్ల నియామ‌కానికి సంబంధించిన ఈ కేసులో ఇప్ప‌టికే మాజీ మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీ, ప్రైమ‌రీ ఎడ్యుకేష‌న్ మాజీ చైర్మ‌న్ మాణిక్ భ‌ట్టాచార్య అరెస్ట‌య్యారు. హైకోర్టు తీర్పుపై ప‌శ్చిమ బెంగాల్ స‌ర్కారు స్పందిస్తూ.. దీనిపై న్యాయ నిపుణుల స‌ల‌హా తీసుకుంటామ‌ని తెలిపింది.

36 వేల మంది టీచ‌ర్ల తొల‌గింపున‌కు హైకోర్టు ఆదేశాలు
X

ప‌శ్చిమ బెంగాల్‌లో 36 వేల మంది టీచ‌ర్ల తొల‌గింపున‌కు కోల్‌క‌తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ నియామ‌కాల్లో కుంభ‌కోణం కేసులో న్యాయ‌స్థానం ఈ ఉత్త‌ర్వులు ఇచ్చింది. నియామ‌క ప్ర‌క్రియ‌లో విధివిధానాలు పాటించ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో వారి నియామ‌కాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ప్ర‌క‌టించారు.

2016లో ప‌శ్చిమ బెంగాల్‌లో నియ‌మితులైన 36 వేల మంది ఉపాధ్యాయులు ఎలాంటి శిక్ష‌ణా లేకుండా నియ‌మితుల‌య్యార‌ని న్యాయ‌మూర్తి తెలిపారు. వారి నియామ‌కాలు చెల్ల‌వ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. ఖాళీ అయిన పోస్టుల‌ను రాబోయే మూడు నెల‌ల్లో భ‌ర్తీ చేయాల‌ని న్యాయ‌స్థానం ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

తొల‌గించిన ఉపాధ్యాయులు నాలుగు నెల‌ల పాటు ప‌నిచేయొచ్చ‌ని, కానీ పారా టీచ‌ర్లకు ఇచ్చే వేత‌నాల‌కు ప‌నిచేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ప‌శ్చిమ బెంగాల్‌లో ఇంత‌టి అవినీతిని తానెన్న‌డూ చూడ‌లేద‌ని ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి గంగోపాధ్యాయ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

టీచ‌ర్ల నియామ‌కానికి సంబంధించిన ఈ కేసులో ఇప్ప‌టికే మాజీ మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీ, ప్రైమ‌రీ ఎడ్యుకేష‌న్ మాజీ చైర్మ‌న్ మాణిక్ భ‌ట్టాచార్య అరెస్ట‌య్యారు. హైకోర్టు తీర్పుపై ప‌శ్చిమ బెంగాల్ స‌ర్కారు స్పందిస్తూ.. దీనిపై న్యాయ నిపుణుల స‌ల‌హా తీసుకుంటామ‌ని తెలిపింది. కోర్టు ఆదేశాల‌ను స‌వాలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

First Published:  14 May 2023 2:26 AM GMT
Next Story