Telugu Global
National

ఉజ్జయిని అత్యాచార నిందితుడికి బుల్డోజర్ ట్రీట్‌మెంట్…

నోటీసులు ఇవ్వకుండానే కూల్చేశారన్న వాదనలు వినిపించడంతో ఈ అంశంపై కూడా మున్సిపల్ కార్పొరేషన్ క్లారిటీ ఇచ్చారు. ఇది ప్రభుత్వం స్థలమని, అక్రమంగా ఇల్లు నిర్మించారని అలాంటప్పుడు నోటీసులతో పని లేదని స్పష్టం చేశారు.

ఉజ్జయిని అత్యాచార నిందితుడికి బుల్డోజర్ ట్రీట్‌మెంట్…
X

ఉజ్జయిని మైనర్ బాలికపై అత్యాచర ఘటన నిందితుడి ఇంటిని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు. అది ప్రభుత్వ స్థలమని, అక్రమ నిర్మాణమని అందుకే తొలగించామని ప్రకటించారు. అక్రమ నిర్మాణల కూల్చివేతకు నోటీసులు ఇవాల్సిన అవసరం లేదన్నారు.


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అత్యాచారానికి గురైన ఆ బాలిక రక్తమోడుతూ, అర్ధనగ్నంగా వీధుల్లో తిరిగిన దృశ్యాలు వెలుగులోకి రావడం దేశ‌మంతా అలజడి రేపింది. ఆ చిన్నారి దీనస్థితిని స్థానికులు పట్టించుకోకుండా ఛీత్కరించుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. చివరికి ఓ ఆలయ పూజారి ఆ బాలికకు దుస్తులు ఇచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. తక్షణమే స్పందించిన పోలీస్ యంత్రాంగం బాలికను ఆసుపత్రికి తరలించడంతో పాటు నిందితుడి కోసం గాలించడం మొదలుపెట్టారు. ఈ కేసులో పోలీసులు వందల మందిని విచారించి, 700 కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. తర్వాత ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న భారత్ సోనిని ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. ఆధారాల సేకరణ కోసం అత‌డిని ఘటనాస్థలానికి తీసుకెళ్ల‌గా, అతడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు వెంటనే స్పందించి అతడ్ని నిర్బంధించారు.


ఈ దారుణంపై నిందితుడి తండ్రి రాజు సోని స్పందిస్తూ.. ఈ ఘాతుకానికి పాల్పడిన తన కుమారుడిని కాల్చి చంపాలని లేదా ఉరి తీయాలని పోలీసులను కోరాడు. అంత పెద్ద తప్పు చేసినప్పటికీ తన కొడుకులో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదన్నాడు.


మరోవైపు నిందితుడు భరత్ సోని ఇంటిని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు. అక్రమ నిర్మాణమని, అందుకే కూల్చివేశామని వెల్లడించారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చేశారన్న వాదనలు వినిపించడంతో ఈ అంశంపై కూడా మున్సిపల్ కార్పొరేషన్ క్లారిటీ ఇచ్చారు. ఇది ప్రభుత్వం స్థలమని, అక్రమంగా ఇల్లు నిర్మించారని అలాంటప్పుడు నోటీసులతో పని లేదని స్పష్టం చేశారు.


First Published:  4 Oct 2023 1:02 PM GMT
Next Story