Telugu Global
National

బ్రిటన్ ప్రధాని 45 రోజుల్లోనే రాజీనామా చేశారు... మోడీజీ మీరెప్పుడు ? కేటీఆర్

బ్రిటన్ ప్రధాని రాజీనామా నేపథ్యంలో భారత ప్ర‌ధాని మోడీ ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు నెటిజనుల నుండి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది.

బ్రిటన్ ప్రధాని 45 రోజుల్లోనే రాజీనామా చేశారు... మోడీజీ మీరెప్పుడు ? కేటీఆర్
X

ఆర్థిక విధానాల్లో విఫలమైనందుకు, ఇచ్చిన వాగ్దానాలనునెరవేర్చనందుకు బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ 45 రోజుల్లోనే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రాజీనామా అంశాన్ని భారత ప్రధాని మోడీకి లింక్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

''ఆర్థిక విధానాల్లో విఫలమైన‌ కారణంగా UK PM లిజ్ ట్రస్ 45 రోజుల కంటే తక్కువ వ్యవధిలో రాజీనామా చేసినట్లు చదివి ఆనందించాను!

భారతదేశంలో, మన ప్రధానమంత్రి మాత్రం

30 ఏళ్లలోనే అత్యధిక నిరుద్యోగం

45 ఏళ్లలోనే అత్యధిక ద్రవ్యోల్బణం

ప్రపంచంలోనే అత్యధిక LPG ధర

డాలర్ తో పోలిస్తే అత్యల్ప స్థాయికి పడిపోయిన రూపాయి రేటు...ఇచ్చారు

#టాలరెంట్ ఇండియా''

అని ట్వీట్ చేశారు.


కేటీఆర్ ట్వీట్ పై స్పందిస్తున్న నెటిజనులు మోడీపై వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైనందుకు బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రెండు నెలల లోపే తన పదవికి రాజీనామా చేశారు.

భారతదేశంలో, ప్రధాని మోడీ తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. తన వినాశకరమైన ప్రణాళికలతో ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేశారు

మోదీ జీ, మీరు పదవి నుంచి ఎప్పుడు దిగితారు ? అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా

''ఒక‌ డాలర్ విలువ 83 రూపాయలు.. ఒక ఎమ్మెల్యే విలువ 18000 కోట్లు'' అని రాజ్ గోపాల్ రెడ్డిని పరోక్షంగా పేర్కొంటూ మరో నెటిజన్ కామె‍ట్ చేశారు.


''8 సంవత్సరాల్లో పత్రికల్లో ప్రతి రోజూ తన పేరు హెడ్‌లైన్స్ లో రావడం కోసం మేనేజ్ చేశారు.

8 సంవత్సరాల్లో అందరి హక్కులు హరించారు

8 సంవత్సరాల్లో ఫెడరలిజాన్ని నాశనం చేశారు

8 సంవత్సరాల్లో ధరలను ఆకాశంలోకి తీసుకెళ్ళారు.

8 సంవత్సరాల్లో అత్య‌ధిక‌ జుమ్లాస్

8 సంవత్సరాల్లో అదానీ క్రోనిజం

8 సంవత్సరాల్లో విద్వేష రాజకీయాలు

8 సంవత్సరాల్లో అలవికాని విధంగా పన్నుల‌ పెంపు

8 సంవత్సరాల్లో కోట్లాది ఉద్యోగాలు కోల్పోవడం

మోదీ పాలనకు 8 ఏళ్లు = చెత్త ప్రభుత్వం'' అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

''నోట్ల రద్దు సమయంలో "నేను తప్పు చేస్తే నన్ను సజీవ దహనం చేయండి" అని ప్రధానమంత్రి మోడీ మనకు చెప్పారు.


2022 ఆర్థిక సంవత్సరంలో ₹500 నకిలీ నోట్లు 102% పెరిగాయి

2022 ఆర్థిక సంవత్సరంలో ₹2,000 నకిలీ నోట్లు 55% పెరిగాయి

నల్లధనం 50 శాతం పెరిగి 14 ఏళ్ల గరిష్టానికి చేరింది'' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


మొత్తానికి 8 ఏళ్ళ మోడి పరిపాలన, 45 రోజుల్లో బ్రిటన్ ప్రధాని రాజీనామా తో పోలుస్తూ నెటిజనులు మోడిపై విరుచుకపడుతున్నారు.

First Published:  21 Oct 2022 3:15 AM GMT
Next Story