Telugu Global
National

బ్రాహ్మణులకు బీజేపీని ప్రశ్నించే హక్కులేదా ? ఓ కార్టూనిస్ట్ ప్రశ్న‌

సతీష్ ఆచార్య ప్రముఖ కార్టూనిస్ట్. అతను వేసే కార్టూన్ ల పై దేశంలో గొప్ప చర్చ జరుగుతుంది. ఆయన బీజేపీతో సహా, అధికార పార్టీలన్నింటి మీద కార్టూన్ లు వేస్తుంటాడు. ఆయన కార్టూన్ లు ముఖ్యంగా బీజేపీ వాళ్ళకు మింగుడుపడవు.

బ్రాహ్మణులకు బీజేపీని ప్రశ్నించే హక్కులేదా ? ఓ కార్టూనిస్ట్ ప్రశ్న‌
X

దేశంలో భారతీయ జనతా పార్టీని ప్రశ్నించేవారిపై భౌతిక, మానసిక దాడులు ఎలా జరుగుతాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ట్రోలింగులకు గురవుతారు. బుల్డోజర్లు ఆస్తులను ధ్వంసం చేస్తాయి. కొందరు జైళ్ళకు వెళ్తారు, మరి కొందరు భూమి మీదనే లేకుండా పోతారు.

బీజేపీ ఫ్యాన్స్ అయితే బీజేపీ విమర్శకులను దేశ‌ద్రోహులుగా చూస్తారు. అలాంటి వారు ఈ దేశ‍ంలో ఉండటానికి అనర్హులని వారి అభిప్రాయం. ఇక బ్రాహ్మ‌లందరూ తప్పనిసరిగా బీజేపీని అనుసరిస్తారని, ఆరెస్సెస్ భావజాలంతోనే ఉంటారని బీజేపీ ఫ్యాన్స్ ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసంతోనే బ్రిటన్ లో ఉన్న ఓ బ్రాహ్మణుణుడైన హిందుత్వ‌ వాది భారత్ లో ఉండే ఓ కార్టూనిస్ట్ తో వాదనకు దిగాడు. ఆ కార్టూనిస్ట్ వారిద్దరి మధ్యన జరిగిన చాట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సతీష్ ఆచార్య ప్రముఖ కార్టూనిస్ట్. అతను వేసే కార్టూన్ ల పై దేశంలో గొప్ప చర్చ జరుగుతుంది. ఆయన బీజేపీతో సహా, అధికార పార్టీలన్నింటి మీద కార్టూన్ లు వేస్తుంటాడు. ఆయన కార్టూన్ లు ముఖ్యంగా బీజేపీ వాళ్ళకు మింగుడుపడవు. బీజేపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆయనపై దాడులు, ట్రోలింగులు చేస్తూ ఉంటారు. అయితే యూకే లో ఉండే ఓ బీజేపీ ఫ్యాన్ మరో రకంగా స్పందించాడు. నువ్వు బ్రాహ్మణుడివై ఉండి బీజేపీకి వ్యతిరేకంగా కార్టూన్ లు వేస్తావా? అని ఆశ్చర్యపోయాడు. కార్టూనిస్ట్ సతీష్ ఆచార్యకు, యూకే బీజేపీ ఫ్యాన్ కు జరిగిన సోషల్ మీడియా చాట్...

''UK బీజేపీ ఫ్యాన్:

మీ కార్టూన్ స్కెచ్‌లు బాగున్నాయి

అయితే బీజేపీపై మీరు చేసే వ్యాఖ్యలు ఆ పార్టీకి అనుకూలంగా ఉండాలి.

సతీష్ ఆచార్య:

అధికార పార్టీని ఎందుకు ప్రశ్నించకూడదు?

UK బీజేపీ ఫ్యాన్:

గ్యాస్, పెట్రోల్ ధరల గురించి మీరు చింతించకండి. ఉక్రెయిన్, రష్యా పోరు కారణంగా ఇది ప్రపంచవ్యాప్త సమస్య. UKలో, విద్యుత్, గ్యాస్ ధర మూడు రెట్లు పెరిగింది.

మీరు నాలాంటి బ్రాహ్మణులే, మనలాంటి వాళ్ళకు బీజేపీ ఎంత ముఖ్యమో మీకు తెలుసునని నేను నమ్ముతున్నాను.

పోరాడాలంటే మోడీ కావాలి.

పాక్ (ఉదా., సర్జికల్ స్ట్రైక్) చైనా (ఉదా. భారత సైన్యం లఢక్, అరుణాచల్‌పై దాడులు)

హిందూ (ఉదా., - రామజన్మ భూమి) భారతదేశం ఐక్యత - (ఉదా., ఆర్టికల్ 370) సైన్యం - (ఆర్మీ జెట్‌లు / క్షిపణులను కొనుగోలు చేయడానికి) ప్రపంచంలో ఖ్యాతి - (ఉదా. భారతదేశం కీర్తిని పెంచ‌డం-US/యూరోప్‌తో కలిసి పని చేయడం)

సతీష్ ఆచార్య:

నాలాంటి కార్టూనిస్ట్ దగ్గర మీ WhatsApp జ్ఞానాన్ని ఉపయోగించడం ఆపివేయండి. ఒక భక్తుని బ్రెయిన్‌వాష్ చేయడానికి దాన్ని ఉపయోగించండి. నేను కేవలం భారతీయ కార్టూనిస్ట్‌ని. కులం కార్డును ఉపయోగించవద్దు. భారతదేశం యొక్క నిజమైన పరిస్థితులు తెలుసుకోవడం కోసం నా కార్టూన్‌లను అనుసరించండి.''

ఇది వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఈ చాట్ స్క్రీన్ షాట్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన సతీష్ ఆచార్య ''UKలో నివసిస్తున్న భారతీయ విద్యావంతుడి జ్ఞానం ఇది. నేను బ్రాహ్మణుడిని కాను. అయినప్పటికీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు బ్రాహ్మణులకు లేదని అతను ఎందుకు అనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు.'' అనికామెంట్ చేశారు.

దీనిపై నెటిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎన్ ఆర్ ఐ లకు వాట్సప్ సమాచారం తప్ప మన దేశ వాస్తవ పరిస్థితులు తెలియవని, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరని పలువురు నెటిజనులు వ్యాఖ్యానించారు.


First Published:  12 March 2023 6:35 AM GMT
Next Story