Telugu Global
National

ఎంపీ న‌వ‌నీత్ కౌర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆమె ప‌ద‌వికి ముంచుకొచ్చిన గండం

ఈ నేప‌థ్యంలో న‌వ‌నీత్‌తో పాటు ఆమె తండ్రికి ముంబై హైకోర్టు వారెంట్లు జారీ చేసింది. గ‌తంలో ఆమె స‌మ‌ర్పించిన కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ర‌ద్దు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఆమె ఎంపీ ప‌ద‌వి ప్ర‌మాదంలో ప‌డింది.

ఎంపీ న‌వ‌నీత్ కౌర్‌కు హైకోర్టులో చుక్కెదురు  - ఆమె ప‌ద‌వికి ముంచుకొచ్చిన గండం
X

సినీ న‌టి, ఎంపీ న‌వ‌నీత్ కౌర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆమె ఎస్సీ కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం చెల్ల‌దంటూ హైకోర్టు మంగ‌ళ‌వారం స్ప‌ష్టం చేసింది. దీంతో న‌వ‌నీత్ ఎంపీ ప‌ద‌వి ప్ర‌మాదంలో ప‌డింది. మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తి నియోజ‌వ‌ర్గం నుంచి 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎస్సీ రిజ‌ర్వేష‌న్‌తో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన న‌వ‌నీత్ ఎంపీగా గెలుపొందారు.

న‌వ‌నీత్ అస‌లు ఎస్సీ కాద‌ని ఆమె ప్ర‌త్య‌ర్థి శివ‌సేన నేత ఆనంద‌రావు అస‌ద‌ల్ కోర్టుకెక్క‌డంతో ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ కొన‌సాగింది. ఆమె ఫోర్జ‌రీ ధ్రువ‌ప‌త్రంతో పోటీ చేశార‌ని ఆయ‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ముంబై హైకోర్టు.. ఆమె త‌న స‌ర్టిఫికెట్ స‌రైన‌దేన‌ని నిరూపించుకునేందుకు నెల రోజులు గ‌డువు ఇచ్చింది. అయినా ఆమె త‌న స‌ర్టిఫికెట్ స‌రైన‌దేన‌ని నిరూపించుకోలేక‌పోయారు.

ఈ నేప‌థ్యంలో న‌వ‌నీత్‌తో పాటు ఆమె తండ్రికి ముంబై హైకోర్టు వారెంట్లు జారీ చేసింది. గ‌తంలో ఆమె స‌మ‌ర్పించిన కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ర‌ద్దు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఆమె ఎంపీ ప‌ద‌వి ప్ర‌మాదంలో ప‌డింది.

First Published:  8 Nov 2022 6:56 AM GMT
Next Story