Telugu Global
National

పెళ్లికి గిఫ్ట్ వచ్చిందా..? ఆత్రంగా తెరవొద్దు, ఆలోచించండి..

పెళ్లి కూతురు మాజీ లవర్ సర్జు.. ఈ గిఫ్ట్ ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు సర్జుని పోలీసులు అరెస్ట్ చేశారు.

పెళ్లికి గిఫ్ట్ వచ్చిందా..? ఆత్రంగా తెరవొద్దు, ఆలోచించండి..
X

అక్రమ సంబంధాలు, లవ్ ఎఫైర్ల నేపథ్యంలో భర్తలను భార్యలు చంపించడం చూస్తూనే ఉన్నాం. పోనీ భార్య ప్రమేయం లేకపోయినా, ఆమెను ఆరాధించే వ్యక్తి, ఆ భర్తపై పగ పెంచుకోవడం, మాటువేసి హతం చేయడం.. వంటి కేసులు కూడా ఇటీవల బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనే చత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లాలో జరిగింది. పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ లో బాంబు ఉండటంతో.. పెళ్లి కొడుకు బలయ్యాడు. పెళ్లికొడుకుతోపాటు ఆయన అన్నయ్య కూడా చనిపోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

చత్తీస్ గఢ్ లో ఇటీవల పెళ్లికి గిఫ్ట్ గా వచ్చిన హోమ్ థియేటర్ ని బిగించే క్రమంలో అది పేలిపోయిందని, పెళ్లికొడుకు హేమేంద్ర, అతని అన్నయ్య రాజ్ కుమార్ చనిపోయారనే వార్త సంచలనంగా మారింది. అయితే ఇది ప్రమాదం అని అనుకున్నారంతా, కానీ పోలీసులు లోతుగా ఆలోచించారు. హోమ్ థియేటర్ పేలిపోవడంపై ఆ కంపెనీని సంప్రదించారు. అలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేదని వారు తేల్చి చెప్పారు. ఆ ఇంటిని పరిశీలించి అసలు విషయం తేల్చారు. ఆ పేలుడు ధాటికి ఇంటి గోడలు పగుళ్లిచ్చాయి, పై కప్పు కూలిపోయింది. దీంతో అనుమానాలు బలపడ్డాయి. ఆ హోమ్ థియేటర్లో బాంబు అమర్చినట్టు గుర్తించారు పోలీసులు, ఆ గిఫ్ట్ ఎవరిచ్చారు అనే కోణంలో ఆరా తీశారు.




పెళ్లి కూతురు మాజీ లవర్ సర్జు.. ఈ గిఫ్ట్ ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు సర్జుని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియురాలు తనని కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో అతడు ఈ పని చేసినట్టు గుర్తించారు. పేలుడు పదార్థాలు పెట్టి హోం థియేటర్ ను గిఫ్టుగా ఇచ్చాడు సర్జు. ఏప్రిల్ 1న ఈ వివాహం జరిగింది. గిఫ్ట్ గా వచ్చిన హోమ్ థియేటర్ ని ఇంటిలో అమర్చుకునే క్రమంలో పేలుడు జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పెళ్లి కొడుకు, అతని అన్నయ్య చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

First Published:  5 April 2023 4:38 AM GMT
Next Story