Telugu Global
National

జోడో యాత్రకు బాలీవుడ్ మద్దతు.. పెయిడ్ ఆర్టిస్ట్ లంటూ బీజేపీ కడుపుమంట

కంగనా రనౌత్ బీజేపీకి మద్దతుగా ఎప్పుడు అతి చేసినా, వెంటనే స్వర భాస్కర్ నుంచి కౌంటర్లు పడేవి. బీజేపీ విధానాలను సునిశితంగా విమర్శించే ఆమె జోడోయాత్రలో పాల్గొనడంతో కాషాయదళం కంగారు పడుతోంది.

జోడో యాత్రకు బాలీవుడ్ మద్దతు.. పెయిడ్ ఆర్టిస్ట్ లంటూ బీజేపీ కడుపుమంట
X


భారత్ జోడో యాత్రకు సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతోంది. సినిమా నటీనటులు రాహుల్ తో కలసి ముందుకు నడుస్తున్నారు. తెలంగాణలో పూనమ్ కౌర్, రాహుల్ గాంధీతో కలసి ముందుకు నడిచారు, చేనేత సమస్యలపై ఆయనతో చర్చించి ఆ తర్వాత కార్యాచరణ అమలులో పెట్టారు. యాత్ర మహారాష్ట్ర చేరుకున్న తర్వాత బాలీవుడ్ నుంచి మద్దతు పెరిగింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర జరుగుతోంది. అక్కడ బాలీవుడ్ నటి స్వర భాస్కర్, రాహుల్ గాంధీతో కలసి జోడో యాత్రలో పాల్గొన్నారు, ఉజ్జయిని పురవీధుల్లో ఆమె రాహుల్ తో కలసి ముందుకు నడిచారు.

బాలీవుడ్ నుంచి బీజేపీపై ధిక్కార స్వరం వినిపించే అతి కొద్దిమంది నటీనటుల్లో స్వరభాస్కర్ ఒకరు. కంగనా రనౌత్ బీజేపీకి మద్దతుగా ఎప్పుడు అతి చేసినా, వెంటనే స్వర భాస్కర్ నుంచి కౌంటర్లు పడేవి. బీజేపీ విధానాలను సునిశితంగా విమర్శించే ఆమె ఇప్పుడు జోడోయాత్రలో పాల్గొనడంతో కాషాయదళం కంగారు పడుతోంది. రాహుల్ పెయిడ్ ఆర్టిస్ట్ లను ఎంకరేజ్ చేస్తున్నారంటూ బీజేపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. పెయిడ్ ఆర్టిస్ట్ లే కాంగ్రెస్ తో కలుస్తున్నారని అంటున్నారు బీజేపీ నేతలు.

పూజా భట్, సుశాంత్ సింగ్, రష్మీ దేశాయ్, రియా సేన్, అమోల్ పాలేకర్.. ఇప్పుడు స్వర భాస్కర్, రాహుల్ తో కలిసి జోడో యాత్రలో పాల్గొన్నారు. బాలీవుడ్ ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొనడాన్ని బీజేపీ ' గెస్ట్ రోల్'గా అభివర్ణిస్తోంది. సెప్టెంబర్ 7న మొదలైన యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 3570 కిలోమీటర్లు సాగుతుంది. ఇప్పటి వరకు రాహుల్ 1209 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారు.

First Published:  1 Dec 2022 10:13 AM GMT
Next Story