Telugu Global
National

నేను హ్యాపీగానే ఉన్నా.. మీకెందుకు అంత బాధ?.. విమర్శలకు సుస్మిత ఘాటు రియాక్షన్

ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. ఆనందం కోసమే బతుకుతున్నా. కానీ కొందరు ఎందుకింత తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు

నేను హ్యాపీగానే ఉన్నా.. మీకెందుకు అంత బాధ?.. విమర్శలకు సుస్మిత ఘాటు రియాక్షన్
X

బాలీవుడ్ నటి సుస్మితా‌సేన్‌తో తాను డేటింగ్‌లో ఉన్నానని.. ఇటీవల ఐపీఎల్ మాజీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విమర్శలు గుప్పుమన్నాయి. సుస్మితా సేన్‌పై పలువురు నెటిజన్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. సుస్మితా సేన్ డబ్బుకోసమే అతడితో డేటింగ్ చేస్తుందంటూ కొందరు విమర్శలు చేశారు. మరికొందరు ఆమె గత జీవితాన్ని.. పాత ప్రేమకథల్ని వెలికితీసి మరీ విమర్శలు గుప్పించారు.

కాగా ఈ విమర్శలపై సుస్మిత ఘాటుగా స్పందించారు. 'నా స్నేహితులు, నాకు తెలిసినవారు, తెలియనివారు. నేనప్పుడూ చూడనివారు కూడా నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను డబ్బు కోసం ఏదో చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. నేను గోల్డ్ డిగ్గర్‌ని. నాకు డబ్బు మీద పెద్దగా మోజు లేదు. నాకు బంగారం కంటే వజ్రాలు ఎక్కువ ఇష్టం. అవసరమైతే వాటిని కొనుగోలు చేయగలను కూడా. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. ఆనందం కోసమే బతుకుతున్నా. కానీ కొందరు ఎందుకింత తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు' అంటూ ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టాలో ఓ పోస్టు చేశారు.

ఇటీవల సినీ, రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల మీద విమర్శలు రావడం కామన్ అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు వేలంవెర్రిగా ఆరోపణలు చేస్తున్నారు. కొందరు సినీ ప్రముఖులు ఇటువంటి ఆరోపణలను బహిరంగంగా ఖండిస్తున్నారు. మరికొందరు మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. వ్యక్తి గత జీవితాల మీద నోరు పారేసుకోవడం అంత మంచిది కాదన్నది విజ్ఞుల సూచన.

Next Story