Telugu Global
National

ఆప్ ఎంపీతో బాలీవుడ్ న‌టి ప‌రిణీతి చోప్రా నిశ్చితార్థం - ఢిల్లీ, పంజాబ్ సీఎంలు స‌హా ప్ర‌ముఖుల హాజ‌రు

శ‌నివారం రాత్రి సెంట్ర‌ల్ ఢిల్లీలో జ‌రిగిన ఈ వేడుక‌కు ఢిల్లీ, పంజాబ్ సీఎంలు స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇరువురి కుటుంబ స‌భ్యులు, ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు స‌హా దాదాపు 150 మంది అతిథుల స‌మ‌క్షంలో ఈ వేడుక‌ ఘ‌నంగా జ‌రిగింది.

ఆప్ ఎంపీతో బాలీవుడ్ న‌టి ప‌రిణీతి చోప్రా నిశ్చితార్థం    - ఢిల్లీ, పంజాబ్ సీఎంలు స‌హా ప్ర‌ముఖుల హాజ‌రు
X

గ‌త కొద్దికాలంగా ప్రేమ‌లో ఉన్న ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా, బాలీవుడ్ న‌టి ప‌రిణీతి చోప్రా.. ఇప్పుడు ఒక్క‌టి కాబోతున్నారు. వాళ్లిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారంటూ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని నిజం చేస్తూ త‌మ నిశ్చితార్థాన్ని వేడుక‌గా నిర్వ‌హించుకున్నారు. శ‌నివారం రాత్రి సెంట్ర‌ల్ ఢిల్లీలో జ‌రిగిన ఈ వేడుక‌కు ఢిల్లీ, పంజాబ్ సీఎంలు స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇరువురి కుటుంబ స‌భ్యులు, ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు స‌హా దాదాపు 150 మంది అతిథుల స‌మ‌క్షంలో ఈ వేడుక‌ ఘ‌నంగా జ‌రిగింది. రాఘ‌వ్ చ‌ద్దా పంజాబ్‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు.

ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అర‌వింద్ కేజ్రీవాల్‌, భ‌గ‌వంత్‌మాన్‌, కాంగ్రెస్ నేత పి.చిదంబ‌రం, శివ‌సేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ప‌రిణీతి సోద‌రి సినీన‌టి ప్రియాంక చోప్రా ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో పాల్గొనేందుకు ప్రియాంక చోప్రా శ‌నివారం ఉద‌య‌మే అమెరికా నుంచి వ‌చ్చారు.

మ‌రోప‌క్క ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను రాఘ‌వ్‌, ప‌రిణీతి త‌మ ఇన్‌స్టాలో షేర్ చేసి అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

First Published:  14 May 2023 2:12 AM GMT
Next Story