Telugu Global
National

ఏం కవర్ చేశావ్ రన్వీర్.. మాధవ్ ని మరిపించావ్..

ఎవరో మార్ఫింగ్ చేసి తన న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారని అంటున్నారు రన్వీర్ సింగ్. తాను న్యూసెన్స్ చేయలేదని, న్యూసెన్స్ కి తాను బాధితుడిగా మారానంటూ కబుర్లు చెప్పారు.

ఏం కవర్ చేశావ్ రన్వీర్.. మాధవ్ ని మరిపించావ్..
X

బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫొటోలతో వార్తల్లోకెక్కారు. రన్వీర్ ఫొటోషూట్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన‌పై ముంబై పోలీసులకు పలు ఫిర్యాదులు అందడంతో వారు విచారణ చేపట్టారు. అప్పట్లో ఆయన మౌనమే సమాధానం అన్నారు. ఆ తర్వాత మళ్లీ రన్వీర్ ను విచారణకు పిలిపించారు. ఈసారి పక్కా ప్రణాళికతో పోలీసుల ముందుకు వచ్చిన రన్వీర్ సింగ్ అసలా ఫొటోలు తనవి కావని బుకాయించారు. ఎవరో మార్ఫింగ్ చేసి తన న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారని వివరించారు. తాను న్యూసెన్స్ చేయలేదని, న్యూసెన్స్ కి తాను బాధితుడిగా మారానంటూ కబుర్లు చెప్పారు.

మాధవ్ కి ఏమాత్రం తగ్గలేదు..

ఇటీవల ఏపీలో ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ వీడియో విషయంలో ప్రతిపక్షం రాద్ధాంతం చేసినా, అధికార పార్టీ మాత్రం మాధవ్ ని వెనకేసుకొచ్చింది. పైగా మాధవ్ తన జిమ్ వీడియో ఒకటి విడుదల చేసి, నగ్న వీడియో కాల్ మాత్రం మార్ఫింగ్ వీడియో అన్నారు. అది ఏమాత్రం నమ్మశక్యంగా లేకపోయినా తనపై కుట్ర చేస్తున్నారంటూ మాధవ్ మండిపడ్డారు, పైగా సామాజిక వర్గాన్ని కూడా తెరపైకి తేవడంతో చాలామంది తమకెందుకొచ్చిన గొడవ అని సైలెంట్ అయ్యారు. చివరకు మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాధవ్ వీడియో మంటపెట్టింది. తీవ్ర వాదోపవాదాల తర్వాత ఇప్పుడు మాధవ్ ని కానీ, ఆ వీడియోని కానీ పట్టించుకునేవారు లేరు. ఈ క్రమంలో రన్వీర్ సింగ్ కూడా తనది మార్ఫింగ్ ఫొటో అనడంతో మాధవ్ ఎపిసోడ్ ని గుర్తు చేసినట్టయింది. అప్పట్లో మాధవ్ ఆ వీడియో తనది కాదని ఎంత గట్టిగా చెప్పారో, ఇప్పుడు రన్వీర్ సింగ్ కూడా ఆ ఫొటోలు తనవి కావని అంతే గట్టిగా చెప్పుకొచ్చారు. నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యారు.

రన్వీర్ పై ట్రోలింగ్..

గతంలో రన్వీర్ సింగ్ కి చాలామంది మద్దతుగా మాట్లాడారు. రన్వీర్ చాలామందికి ఆదర్శం అంటూ ఆమధ్య రామ్ గోపాల్ వర్మ కూడా మద్దతు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ ఫొటోలు తనవి కాదంటూ రన్వీర్ ప్లేట్ ఫిరాయించడంతో అందరూ షాకయ్యారు. కేసుల గోల పడలేకే రన్వీర్ మాట మార్చారని తెలుస్తోంది. దీంతో రన్వీర్ పై ట్రోలింగ్ మొదలైంది. నువ్వేమైనా పెద్ద ఫిగర్ వా, నీ ఫోటో మార్ఫింగ్ చేయడానికి.. అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. అప్పట్లో న్యూడ్ ఫొటోలపై ఎంతమంది స్పందించారో, ఇప్పుడు రన్వీర్ మార్ఫింగ్ స్టేట్ మెంట్లపై అంతకంటే ఎక్కువమంది రియాక్ట్ అవుతున్నారు. రన్వీర్ ని ఆటాడేసుకుంటున్నారు.

First Published:  15 Sep 2022 12:35 PM GMT
Next Story