Telugu Global
National

5 రాష్ట్రాల‌ ఎన్నికల్లో బీజేపీ లీగల్ గా పెట్టిన‌ ఖర్చు 340 కోట్లు

ఈ సంవత్సరం మొదట్లో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 340 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 221 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాల్లో 194 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

5 రాష్ట్రాల‌ ఎన్నికల్లో బీజేపీ లీగల్ గా పెట్టిన‌ ఖర్చు 340 కోట్లు
X

ఈ ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 340 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్టు ఎన్నికల కమిషన్ కు నివేదించింది. అయితే కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో తన ప్రచారానికి 194 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది.

ఈ రెండు పార్టీలు ఇచ్చిన ఖర్చుల నివేదిక ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో చేసిన ఖర్చును ఎన్నికల సంఘం తన డొమైన్ లో పోస్ట్ చేసింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ 340 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లో 221 కోట్ల రూపాయలు, మణిపూర్‌లో 23 కోట్లు, ఉత్తరాఖండ్‌లో 43.67 కోట్లు, పంజాబ్‌లో 36 కోట్ల కంటే ఎక్కువ, గోవాలో 19 కోట్లు ఖర్చు చేసినట్లు బిజెపి తన లెక్కలను ఈసీకి నివేదించింది.

కాంగ్రెస్ దాఖలు చేసిన నివేదిక ప్రకారం, ఐదు రాష్ట్రాల్లో ప్రచారం , సంబంధిత ఖర్చుల కోసం 194 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు తమ ఎన్నికల వ్యయ నివేదికలను నిర్ణీత కాలవ్యవధిలో EC ముందు సమర్పించాల్సి ఉంటుంది.

First Published:  23 Sep 2022 2:38 AM GMT
Next Story