Telugu Global
National

కుదిరితే డబ్బులు, లేదంటే అమ్మాయిలు.. ఆప్ ఎమ్మెల్యేలపై బీజేపీ కుట్రలు..

ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తనపై హనీట్రాప్ జరుగుతోందని, ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుదిరితే డబ్బులు, లేదంటే అమ్మాయిలు.. ఆప్ ఎమ్మెల్యేలపై బీజేపీ కుట్రలు..
X

ఎమ్మెల్యేకి 20కోట్ల రూపాయలు. లేటెస్ట్ గా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ కట్టిన రేటు ఇది. తెర వెనుక ఏదో జరుగుతోందని కీడు శంకించిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమ పార్టీ ఎమ్మెల్యేలందర్నీ సమావేశపరిచారు. 62మందికి గాను 53మంది హాజరయ్యారు. హమ్మయ్య అనుకున్నారు, మిగతావాళ్లంతా ఫోన్లో మాట్లాడినా లోలోపల ఏదో భయం. మొత్తం 40మందికి బీజేపీ ఎర వేసినట్టు సమాచారం. అయితే ఇది కేవలం డబ్బులతో పోయే పీడలాగా లేదు, ఎమ్మెల్యేలకు అమ్మాయిలను కూడా ఎరవేశారని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తనపై హనీట్రాప్ జరుగుతోందని, ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంజలి అనే పేరుతో ఓ అమ్మాయినుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతికి వాట్సప్ మెసేజ్ లు వచ్చాయి. హాయ్..! యు ఆర్ అలోన్..? ప్లీజ్ యార్..!! అంటూ మెల్లగా మాటల్లో దింపాలని చూసింది అంజలి. అయితే ఇది హనీట్రాప్ గా గుర్తించిన ఎమ్మెల్యే నువ్వు ఎవరు, ఎవరు నా నెంబర్ ఇచ్చారు, ఎందుకు నన్ను కాంటాక్ట్ అయ్యావంటూ ప్రశ్నించారు, పోలీసులకు సమాచారమిస్తానంటూ హెచ్చరించారు. అవతలి వ్యక్తి ఏమాత్రం జంకలేదు. గూగుల్ నుంచి మీ నెంబర్ సేకరించానని చెప్పారు. దీంతో ఇది హనీట్రాప్ గా నిర్థారించుకున్న సోమ్ నాథ్.. ఆ వాట్సప్ సంభాషణను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వ్యవహారంలో విచారణ జరపాలని పోలీసులను కోరారు. హనీట్రాప్ వ్యవహారంలో బీజేపీ మీద తనకు అనుమానాలున్నాయని చెప్పారు.

నయానో.. భయానో..

స్థానిక పార్టీల పెత్తనం ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను బెదిరించడానికి సామ, దాన, భేద, దండోపాయాల్ని ప్రయోగిస్తోంది బీజేపీ. సీబీఐ, ఈడీలను కూడా ఉసిగొల్పుతోంది. ఆల్రడీ ఢిల్లీలో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసేందురు రంగం సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వంలో, పార్టీలో అలజడి తెచ్చేందుకు ఎమ్మెల్యేలకు 20 కోట్ల ఆఫర్ కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడిలా హనీట్రాప్ కూడా ఈ ఆపరేషన్ ఆప్ లో భాగమేనంటున్నారు ఎమ్మెల్యేలు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

First Published:  26 Aug 2022 2:20 AM GMT
Next Story