Telugu Global
National

జబర్దస్త్ జడ్జిలకు కలిసొస్తున్న కాలం..

జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పార్టీ పదవి ఉన్నా కూడా.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేటెడ్ పోస్ట్ రావడంతో ఆమె సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. తన నియామక పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరితో తన సంతోషాన్ని పంచుకున్నారు.

జబర్దస్త్ జడ్జిలకు కలిసొస్తున్న కాలం..
X

జబర్దస్త్ ప్రోగ్రామ్ కి జడ్జిగా వ్యవహరిస్తూనే రోజా మంత్రి అయ్యారు, తనకెంతో ఇష్టమైన కార్యక్రమానికి కన్నీటితో వీడ్కోలు చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మరో మహిళా జడ్జికి కాబోతున్నట్టు తెలుస్తోంది. రోజా తర్వాత జబర్దస్త్ కి జడ్జిలుగా వస్తున్న సీనియర్ హీరోయిన్లలో ఖుష్బూ కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె తమిళనాడు బీజేపీలో కీలక నేత. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా. అయితే ఇప్పుడామెకు టైమ్ కలిసొచ్చింది. జాతీయ మహిళా కమిషన్(NCW) సభ్యురాలిగా ఆమెను కేంద్రం నామినేట్ చేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరు నామినేట్ అయ్యారు. జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పార్టీ పదవి ఉన్నా కూడా.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేటెడ్ పోస్ట్ రావడంతో ఆమె సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. తన నియామక పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరితో తన సంతోషాన్ని పంచుకున్నారు.


ఖుష్బూ తన నియామకంపై ప్రధాని నరేంద్రమోదీకి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇంతపెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు ప్రధాని మోదీకి, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న నారీ శక్తని రక్షించడానికి, సంరక్షించడానికి నేను కృషి చేస్తాను’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘మహిళ హక్కుల కోసం ఆమె అలుపులేని పోరాటానికి గుర్తింపు’’ అని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అభినందనలు తెలిపారు.

జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేస్తారా..?

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ కి జడ్జిగా కొనసాగిన రోజా, మంత్రి అయ్యాక మాత్రం దూరం జరిగారు. ఇప్పుడు ఖుష్బూకి కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. జబర్దస్త్ లో మహిళలపై వేసే జోకులకు ఖుష్బూ పగలబడి నవ్వితే అది మరింత కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది, అందుకే ఆమె ఆ షో విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. తమిళనాట డీఎంకేతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఖుష్బూ, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు, గత ఎన్నికల్లో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, ఇప్పుడు నామినేటెడ్ పదవితో మరోసారి వార్తల్లోకెక్కారు.

First Published:  27 Feb 2023 12:44 PM GMT
Next Story