Telugu Global
National

Sridevi Biography: పుస్తకంగా నటి శ్రీదేవి బయోగ్రఫీ

Sridevi Biography: ఈ విషయాన్ని ఆమె భర్త బోనీకపూర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. అతి త్వరలో శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకం 'శ్రీదేవి.. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ ' పేరుతో మార్కెట్లోకి రానున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని ప్రచురించనున్న వెస్ట్ ల్యాండ్ బుక్స్ పుస్తక ముఖ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Sridevi Biography: పుస్తకంగా నటి శ్రీదేవి బయోగ్రఫీ
X

పాన్ ఇండియా అనే పదం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో విప‌రీతంగా వినిపిస్తోంది. అయితే ఈ పదం పుట్టక ముందే అందాల నటి శ్రీదేవి పాన్ ఇండియా స్థాయిలో ఈ భాష ఆ భాష, ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ప్రేక్షకులను అలరించింది. అప్పటి ప్రేక్షకుల అందాల దేవతగా హృదయంలో నిలిచిపోయింది. ఎన్నెన్నో ఘన విజయాలు సొంతం చేసుకుంది.

తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి చిరంజీవి, నాగార్జున తరం వరకు, తమిళంలో ఎంజీఆర్, జెమినీ గణేషన్ నుంచి, రజినీకాంత్, కమల్ హాసన్ తరం వరకు, హిందీలో అమితాబ్ బచ్చన్ నుంచి ఆ తర్వాతి తరం హీరోలైన అనిల్ కపూర్, షారుఖ్ ఖాన్ వరకు అందరు అగ్రహీరోలతో శ్రీదేవి ఆడి పాడింది.

బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించిన శ్రీదేవి ఆ తర్వాత హీరోయిన్ గా వివిధ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించింది. సుమారు 40 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో రాణించింది. ఇన్ని ఇండస్ట్రీల్లో నటించడమే కాదు..అన్ని చోట్ల నంబర్ వన్ స్థానం కూడా సాధించింది. జాతీయ అవార్డు కూడా అందుకుంది.

సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఘనతలు సాధించిన శ్రీదేవి బయోగ్రఫీ ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. ఈ విషయాన్ని ఆమె భర్త బోనీకపూర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. అతి త్వరలో శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకం 'శ్రీదేవి.. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ ' పేరుతో మార్కెట్లోకి రానున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని ప్రచురించనున్న వెస్ట్ ల్యాండ్ బుక్స్ పుస్తక ముఖ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శ్రీదేవి జీవితం ఆధారంగా బయోగ్రఫీని ప్రచురిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. శ్రీదేవి బయోగ్రఫీని ప్రముఖ కాలమిస్ట్, రచయిత పరిశోధకుడు ధీరజ్ కుమార్ రాశారు.

First Published:  9 Feb 2023 3:05 PM GMT
Next Story