Telugu Global
National

బిజెపి ఎజెండా కొన‌సాగ‌నీయ‌ను..బీహార్‌ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్‌ సింగ్‌ రాజీనామా

బీహార్ వ్యవసాయ మంత్రి సుధాకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. మహా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ తన శాఖలో బీజేపీ ఎజెండా కొనసాగుతోందని ఆయన మండి పడ్డారు.

బిజెపి ఎజెండా కొన‌సాగ‌నీయ‌ను..బీహార్‌ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్‌ సింగ్‌ రాజీనామా
X

బీహార్ కొత్త ప్ర‌భుత్వంలో ఆర్జెడీ ఎమ్మెల్యే , వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ ఆదివారం నాడు మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేవారు. ఇటీవల తన శాఖలో ఉన్న అవినీతిపై ధ్వజమెత్తిన మ‌రుస‌టి రోజునే ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌ర్వాత తన శాఖలో "బీజేపీ ఎజెండా కొనసాగింపు"ను అనుమతించబోనని సింగ్ చెప్పారు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఎపిఎంసి) చట్టం, మండి' వ్యవస్థను పునరుద్ధరించే వరకు తాను విశ్రమించబోనని సింగ్ చెప్పారు. 2006లో వాటిని రద్దు చేస్తూ అప్ప‌టి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయం "రైతు వ్యతిరేకం" అని అన్నారు.

బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్ డియే ప్రభుత్వం 2006లో రాష్ట్రంలో ఎపిఎంసి చట్టం, 'మండి' (వ్యవసాయ ఉత్పత్తుల టోకు మార్కెట్‌లు)ని రద్దు చేసింది.

ఆర్ జెడి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జగదానంద్ సింగ్ కుమారుడే సుధాకర్ సింగ్. ఆయ‌న కైమూర్ జిల్లాలోని రామ్‌గఢ్ నుండి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. నిన్న ఆయ‌న మాట్లాడుతూ.. "రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా, రాష్ట్రంలో 'మహాగట్ బంధన్' ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ శాఖలో బిజెపి ఎజెండాయే కొనసాగించ‌డం నాకు ఇష్టం లేదు."అని అన్నారు. త‌న శాక‌లు అధికారులు అంతా దొంగ‌లేన‌ని, ఆ శాఖ‌కు నేతృత్వం వ‌హిస్తున్న తాను దొంగ‌ల‌కు బాస్ అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌నం రేకెత్తించారు.

ఎపిఎంసి చట్టం, 'మండి' వ్యవస్థ పున‌రుద్ధ‌రించేందుకు జాతీయ స్థాయి లో పోరాడ‌తాన‌ని సుధాక‌ర్ సింగ్ నిన్న చెప్పారు.

దేశంలో, ముఖ్యంగా బీహార్‌లో ఈ రెండు చట్టాల పునరుద్ధరణ ఆవశ్యకత గురించి తెలియజేయడానికి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో అపాయింట్‌మెంట్ కోరాను. త్వ‌ర‌లో వారిని క‌లిసి ఈ వియ‌మై చ‌ర్చిస్తాన‌ని సింగ్ చెప్పారు.

First Published:  2 Oct 2022 10:05 AM GMT
Next Story