Telugu Global
National

ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ BF.7తో పెద్దగా ప్రమాదం లేదు- స్పష్టం చేస్తున్న నిపుణులు

''భారతదేశంలో మొదట BA.1 వెర్షన్ వెలుగు చూసింది. ఆ తర్వాత BA.2, ఇది జనవరి-ఫిబ్రవరి 2022లో మూడవ వేవ్‌కు కారణమైంది. "అప్పటి నుండి, BA.2 యొక్క కుమారులు, కుమార్తెలు, మనవరాళ్లు భారతదేశంలో తిరుగుతున్నారు, కానీ పెద్దగా ఎలాంటి వేవ్ లు సృష్టించలేదు." అని IMA నేషనల్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సహ-ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ అన్నారు

ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ BF.7తో పెద్దగా ప్రమాదం లేదు- స్పష్టం చేస్తున్న నిపుణులు
X

ఒమిక్రాన్ సబ్-వేరియంట్ BF.7 వల్ల‌ చైనాతో సహా అనేక దేశాల్లో ప్రస్తుత కోవిడ్ ఉప్పెన ముంచెత్తుతోంది. భారతదేశంలో కూడా ఇప్పటివరకు ఈ వేరియంట్‌కు సంబంధించిన నాలుగు కేసులు వెలుగు చూశాయి, ఇందులో గుజరాత్ నుండి రెండు, ఒడిశా నుండి రెండు ఉన్నాయి.

అయితే కరోనావైరస్ యొక్క ఈ కొత్త సబ్‌స్ట్రెయిన్ భారతదేశాన్ని ఇప్పటి వరకైతే పెద్దగా ప్రభావితం చేయలేదు. అయితే, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలని,వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని కేంద్రం ఆదేశించింది.

BF.7 అనేది ఒమిక్రాన్ వేరియంట్ BA.5 యొక్క ఉప-వంశం, దీనీని IMA నేషనల్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సహ-ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్, 'ఒమిక్రాన్ యొక్క ముని మనవడు' అని వర్ణించారు.

"BF.7 అనేది ఒమిక్రాన్ కు మునిమనవడు, ఇది మునుపు కరోనా సోకిన లేదా టీకాలు వేసిన వ్యక్తులకు కూడా సోకగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఓమిక్రాన్ వలె అదే వైరస్, కానీ అదనపు ఉత్పరివర్తనాలతో... తీవ్రమైన వ్యాధికి కారణమయ్యే సూచనలు లేవు, "అని అతను చెప్పాడు.

ఓమిక్రాన్ నవంబర్ 2021లో దక్షిణాఫ్రికాలో కనిపించిన తర్వాత, అది కేవలం ఒకటిన్నర నెలల్లోనే ప్రపంచాన్ని కవర్ చేసిందని డాక్టర్ జయదేవన్ చెప్పారు. ''భారతదేశంలో మొదట BA.1 వెర్షన్ వెలుగు చూసింది. ఆ తర్వాత BA.2, ఇది జనవరి-ఫిబ్రవరి 2022లో మూడవ వేవ్‌కు కారణమైంది. "అప్పటి నుండి, BA.2 యొక్క కుమారులు, కుమార్తెలు, మనవరాళ్లు భారతదేశంలో తిరుగుతున్నారు, కానీ పెద్దగా ఎలాంటి వేవ్ లు సృష్టించలేదు."అన్నారాయన‌

ఓమిక్రాన్ తదుపరి BA.5 వెర్షన్ తో పాశ్చాత్య దేశాలు బాధపడినప్పుడు, మనం దేశంలో మాత్రం పెద్దగా కేసుల పెరుగుదల లేదు. BF.7 గానీ దాని పూర్వీకుడు BA.5 గానీ భారతదేశంలో ఎలాంటి ప్రభావం చూపలేదు. దీనికికారణం కోవిడ్19 కు దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ తీసుకోవడం, సహజంగా పొందిన రోగనిరోధక శక్తే.

మొత్తానికి కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ ముని మనవడు BF.7 వేగంగా వ్యాపిస్తుంది కానీ పెద్దగా ప్రమాద కారి కాదు అని డాక్టర్ రాజీవ్ జయదేవన్ చెప్తున్నారు. ఈ వేరెయెంట్ సోకితే అత్యంత సాధారణ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు, అలసట, ముక్కు కారటం.

First Published:  25 Dec 2022 7:53 AM GMT
Next Story