Telugu Global
National

ట్రాక్టర్లలో ఉద్యోగాలకు వెళ్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

కర్నాటకలో పడుతున్న భారీ వర్షాలకు బెంగుళూరు రోడ్లపై పెద్ద ఎత్తున నీళ్ళు పారుతున్నాయి. కార్లు, బైకులు, ఆటోలు నడవ‌లేని పరిస్థితి ఉండటంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ట్రాక్టర్లలో కార్యాలయాలకు వెళ్తున్నారు.

ట్రాక్టర్లలో ఉద్యోగాలకు వెళ్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
X

వర్షాలతో బెంగుళూరు నగరం అస్తవ్యస్తంగా తయారయ్యింది. రోడ్లు ఇప్పటికీ నీటితో నిండిపోయి వాహనాలు వెళ్ళే పరిస్థితి లేదు. దాంతో ఉద్యోగులు ఇబ్బందికర‌ పరిస్థితిలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేరు ఉద్యోగులు రెగ్యులర్ గా వెళ్ళే క్యాబ్ లు, స్వంత వాహనాలు రోడ్డుపై నడిచే అవకాశం లేకుండా పోయింది. కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించినప్పటికీ, చాలా కంపెనీలు ఆఫీస్ కు రావాల్సిందే అని ఉద్యోగులను ఆదేశించాయి. పైగా లీవ్ లు కూడా ఇవ్వకపోవడంత్యో నీళ్ళు నిండి పోయిన కొన్ని ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలకు వెళ్ళడానికి ఉద్యోగులు చాలా కష్టాలు పడుతున్నారు.

హెచ్ఏఎల్ విమానాశ్ర‌యం వ‌ద్ద ఉన్న యెమ‌లూర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఐటీ ఉద్యోగులు త‌మ ఆఫీసుల‌కు ట్రాక్ట‌ర్ల‌లో వెళ్తున్నారు. ఉద్యోగులు ట్రాక్టర్లలో విధులకు వెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడక్కడ షేర్ ఆటోల మాదిరిగానే షేర్ ట్రాక్టర్లు నడుస్తున్నాయి.

కాగా గత 90 ఏళ్ళలో ఇలాంటి వర్షాన్ని చూడలేదని కర్నాటక సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై అన్నారు. చాలా కంపెనీలు జల దిగ్భంధం అయిపోయాయని, ఈ విషయంపై ఆయా కంపెనీలతో చర్చిస్తామని సీఎం చెప్పారు. ఈ వర్షాల కారణంగా తమకు 225 కోట్ల నష్టం వచ్చిందని ఓఆర్ ఆర్ కంప్ర్నీల అసోసియేషన్ ప్రకటించింది.



First Published:  6 Sep 2022 8:26 AM GMT
Next Story