Telugu Global
National

ఎన్డీయే ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్

ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్ క‌ర్ ను ఎన్డీయే ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించింది. తెర‌పైకి ఎన్నో పేర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ అనూహ్యంగా ధ‌న‌క‌ర్ పేరును బిజెపి జాతీయ అధ్య‌క్షుడు జె.పి న‌డ్డా ప్ర‌క‌టించారు.

ఎన్డీయే ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్
X

ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్ క‌ర్ ను ఎన్డీయే ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించింది. తెర‌పైకి ఎన్నో పేర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ అనూహ్యంగా ధ‌న‌క‌ర్ పేరును బిజెపి జాతీయ అధ్య‌క్షుడు జె.పి న‌డ్డా ప్ర‌క‌టించారు. అభ్య‌ర్ధిని ఖ‌రారు చేయ‌డం కోసం బిజెపి పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశ‌మైంది. అనంత‌రం ధ‌న‌క‌ర్ పేరును న‌డ్డా ప్ర‌క‌టించారు.

ధన్‌ఖర్‌ను "కిసాన్ పుత్ర" (రైతు కుమారుడు) అని, "ప్రజల గవర్నర్"గా తనను తాను నిరూపించుకున్నాడ‌ని న‌డ్డా కొనియాడారు.

ధ‌న‌క‌ర్ ను అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశారు. "కిసాన్ పుత్ర జగదీప్ ధ‌న్క‌ర్‌ జీ వినయశీలత గ‌ల‌వారు. ఆయ‌న‌కు న్యాయ, శాసన, రాజ్యాంగ విష‌యాల్లో అపార అనుభ‌వం ఉంద‌న్నారు. అతను ఎప్పుడూ రైతులు, యువత, మహిళలు , అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేశారు. ' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్నర్‌గా కొన‌సాగుతున్న ధ‌న్‌క‌ర్ రాజ‌స్థాన్‌కు చెందిన వారు. వృత్తిరీత్యా న్యాయ‌వాది అయిన ధ‌న్‌క‌ర్‌... సుప్రీంకోర్టులో ప‌లు కేసుల‌ను వాదించారు. రాజ‌స్థాన్ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగానూ ఆయ‌న ప‌నిచేశారు. 1989లో జ‌న‌తాద‌ళ్ త‌ర‌ఫున ఎంపీగా గెలిచిన ధ‌న్‌క‌ర్‌.. 1989-91 మ‌ధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు.ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు.. 1993-1998 మధ్యకాలంలో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుండి రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాత, అతను 2003లో భారతీయ జనతా పార్టీ లో చేరారు. అతను బిజెపి లా అండ్ లీగల్ అఫైర్స్ విభాగానికి జాతీయ కన్వీనర్‌గా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ గా 2019లో బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టినుంచీ ఆయనకు ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ తో ప‌లు నిర్ణ‌యాల్లో విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.

First Published:  17 July 2022 3:37 AM GMT
Next Story