Telugu Global
National

ఇంత జరిగినా సరే, అదానీకి లోన్లు ఇస్తానంటున్న‌ ప్రభుత్వ బ్యాంకు

అదానీ గ్రూపు షేర్ల పతనం, అతి వేగంగా కరిగి పోతున్న ఆదాయం చూసి ఆయనకు లోన్లు ఇచ్చిన, ఆయన గ్రూపుల్లో పెట్టుబడులు పెట్టిన బ్యాంకులు, సంస్థలు ఆందోళన చెందుతూ ఉంటే బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం అదానీకి ఇంకా లోన్లు ఇస్తామని ముందుకు రావడంలోని మతలబు ఏంటో ?

ఇంత జరిగినా సరే, అదానీకి లోన్లు ఇస్తానంటున్న‌ ప్రభుత్వ బ్యాంకు
X

అదానీ గ్రూప్ సంస్థల్లో స్టాక్ మానిపులేషన్, ట్యాక్స్ లో, అకౌంట్స్ లో అవకతవకలు జరుగుతున్నాయన్న హిండెన్‌ బర్గ్ నివేదికతో అల్లకల్లోలం అవుతోంది అదానీ గ్రూపు. అదానీ ఆస్తులు ప్రతి రోజు దిగజారుతున్నాయి. ఇప్పటికే పది లక్షల కోట్ల కన్నా ఎక్కువే నష్టపోయారు అదానీ. అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన వ్యక్తిగత మదుపుదారులు, సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు తమ పెట్టుబడి వెనక్కి వస్తుందో రాదో తెలియక అయోమయంలో ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఇండస్ ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లు, ఎల్ ఐసీ తమ లోన్లు, పెట్టుబడులకు సంబంధించిన అంశంపై అదానీ గ్రూప్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్ఠంగా ఉందని ప్రకటించినప్పటికీ లోలోపల ఆందోళనగానే ఉంది.

ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకు 'బ్యాంక్ ఆఫ్ బరోడా' మాత్రం అదానీకి ఇప్పటికీ లోన్లు ఇస్తామని ప్రకటించింది. తమ బ్యాంకు నిబంధనల ప్రకారం అదానీ గ్రూప్ వివరాలు సంతృప్తికరంగా ఉన్నాయని బ్యాంక్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.

అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాలు ఆర్‌బీఐ అనుమతించిన దాంట్లో కేవలం పావు శాతం మాత్రమే ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చద్ధా రాయిటర్స్ ‌తో తెలిపారు. ''ప్రస్తుతం మాకు ఎలాంటి ఆందోళన లేదు. లోన్ మంజూరు విషయంలో అదానీ గ్రూప్ మా తొలి ప్రాధాన్యత‌లో ఉంది. మా దృష్టికి ఏదైనా అదానీ గ్రూపు రుణ దరఖాస్తు వస్తే దానిని పరిశీలిస్తాం. అశాస్త్రీయంగా అదానీ గ్రూప్‌కు రుణాలు మంజూరు చేయకపోవడమనేది జరగదు. ఆ గ్రూప్ సంస్థలకు మేము ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలతో బ్యాంకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదు.'' అని పేర్కొన్నారు ఎండీ సంజీవ్ చద్ధా.

అదానీ గ్రూపు షేర్ల పతనం, అతి వేగంగా కరిగి పోతున్న ఆదాయం చూసి ఆయనకు లోన్లు ఇచ్చిన, ఆయన గ్రూపుల్లో పెట్టుబడులు పెట్టిన బ్యాంకులు, సంస్థలు ఆందోళన చెందుతూ ఉంటే బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం అదానీకి ఇంకా లోన్లు ఇస్తామని ముందుకు రావడంలోని మతలబు ఏంటో ?

First Published:  7 Feb 2023 4:06 AM GMT
Next Story