Telugu Global
National

మార్చి 5 నాటికి ఎల్‌ఐసికి అదానీ గ్రూప్ చెల్లించాల్సిన‌ రుణం రూ.6,183 కోట్లు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే కాక ఆ కంపెనీలకు రుణాలు కూడా ఇచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, ఈ నెల 5వ తేదీ నాటికి అదానీ కంపెనీలు ఎల్‌ఐసికి చెల్లించాల్సిన రుణం రూ.6,183 కోట్లు.

మార్చి 5 నాటికి ఎల్‌ఐసికి అదానీ గ్రూప్ చెల్లించాల్సిన‌ రుణం రూ.6,183 కోట్లు
X

అదానీ కంపెనీల పై హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అతని కంపెనీల కార్యకలాపాల‌పై ప్రజలకు, ముఖ్యంగా మదుపుదార్లకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే కేంద్ర బీజేపీ సర్కార్ నిబందనలకు విరుద్దంగా అదానీకి సహకరించిందని, ప్రభుత్వరంగ సంస్థలు అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు ఇవ్వడాని ఒత్తిడి చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ ఐ సీ అదానీ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు, ఇచ్చిన రుణాల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే కాక ఆ కంపెనీలకు రుణాలు కూడా ఇచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, ఈ నెల 5వ తేదీ నాటికి అదానీ కంపెనీలు ఎల్‌ఐసికి చెల్లించాల్సిన రుణం రూ.6,183 కోట్లు.

LIC మార్చి 5 నాటికి అదానీ కంపెనీలకు ఇచ్చిన రుణాల వివరాలు:

అదానీ పోర్ట్స్, SEZలు రూ. 5,388.60 రుణం

అదానీ పవర్ (ముంద్రా)కు రూ. 266 కోట్లు,

అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్ - ఫేజ్ I కు రూ. 81.60 కోట్లు,

అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్ - ఫేజ్ III కి రూ. 254.87 కోట్లు,

రాయ్‌గఢ్ ఎనర్జీ జనరేషన్ లిమిటెడ్ కు రూ. 45 కోట్లు,

రాయ్‌పూర్ ఎనర్జెన్ లిమిటెడ్ కు (రూ. 145.67 కోట్లు

"ప్రాజెక్ట్‌ల సాధ్యత, వచ్చే ఆదాయం, తగిన భద్రత, రుణాల చెల్లింపును అంచనా వేసిన తర్వాతనే రుణాలు మంజూరు చేయబడతాయని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తెలియజేసాయి. ప్రాజెక్ట్ వల్ల‌ వచ్చే ఆదాయం ద్వారా రుణాలు తిరిగి చెల్లిస్తారు తప్ప‌ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా కాదు. ," అని నిర్మల అన్నారు.

First Published:  14 March 2023 3:29 AM GMT
Next Story