Telugu Global
National

డిప్యూటీ సీఎంల‌ నియామకం చట్టవిరుద్ధం కాదు.. - సుప్రీంకోర్టు కీలక తీర్పు

డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ పార్టీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది.

డిప్యూటీ సీఎంల‌ నియామకం చట్టవిరుద్ధం కాదు.. - సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

ఉప ముఖ్యమంత్రుల నియామకం చట్టవిరుద్ధం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అత్యున్నత ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని వెల్ల‌డించింది. ఈ మేరకు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ పదవులపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావనా లేకపోయినప్పటికీ డిప్యూటీ సీఎంల నియామకం చట్ట విరుద్ధం కాదని స్పష్టం చేసింది.

డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ పార్టీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. మంత్రి వర్గంలోని సీనియర్‌ లీడర్లకు ప్రాధాన్యం ఇవ్వడానికి లేదా సంకీర్ణంలోని పార్టీలకు సముచిత స్థానం కల్పించడానికి కొన్ని రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులను నియమిస్తున్నారని ధర్మాసనం తెలిపింది. పేరుకు డిప్యూటీ సీఎం అని పిలిచినప్పటికీ ఆయన కూడా మంత్రి వర్గంలో ఒక మంత్రేనని వివరించింది. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగంలోని ఏ నిబంధననూ ఉల్లంఘించడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు ఉండటం గమనార్హం.

First Published:  12 Feb 2024 2:39 PM GMT
Next Story