Telugu Global
National

భారత్ జోడో యాత్రలో మరో రాహుల్ గాంధీ క్రేజ్

అతను 5’ 6 అడుగుల ఎత్తు, లేత గోధుమరంగు జుట్టు, గడ్డంతో సడెన్ గా చూడగానే ఎవరైనా రాహుల్ గాంధీయే అనుకుంటారు. ఇతని పేరు మొహమ్మద్ ఫైసల్ చౌదరి ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ఇతన్ని అందరూ చోటా రాహుల్ అనే అంటారు. ఇతను కాంగ్రెస్ కార్యకర్త.

భారత్ జోడో యాత్రలో మరో రాహుల్ గాంధీ క్రేజ్
X

భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ను దాటుతున్నప్పుడు అక్కడ ఒక మహిళ, రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చింది. తన సమస్యలను అతనికి చెప్పడం ప్రారంభించింది. సమస్యలన్నీ వరసపెట్టి చెబుతూనే ఉంది. ఇంతలో హటాత్తుగా ఆమె ఆగిపోయింది. రాహుల్ గాంధీ మొహంలోకి తీక్షణంగా చూసింది. అయ్యో... అని తల కొట్టుకొని వెళ్ళిపోయింది.

ఎందుకలా ఆ మహిళ రాహుల్ గాంధీకి చెబుదామనుకున్న విషయాలను పూర్తిగా చెప్పకుండానే వెళ్ళి పోయింది ? ఎందుకు ఆ మహిళ నిరాశ చెందింది ? ఎందుకంటే అతను రాహుల్ గాంధీ కాదు కాబట్టి. రాహుల్ గాంధీలాగే ఉన్న, ఆయన లాగే తెల్లటి సగం చేతుల T-షర్టు, స్వెటర్ లేకుండా లేత గోధుమరంగు ప్యాంటు వేసుకున్న మరో వ్యక్తి కాబట్టి. ఇప్పుడు భారత్ జోడో యాత్రలో రాహుల్ కు ఉన్నంత క్రేజ్ ఈయనకు కూడా ఉంది.

అతను 5’ 6 అడుగుల ఎత్తు, లేత గోధుమరంగు జుట్టు, గడ్డంతో సడెన్ గా చూడగానే ఎవరైనా రాహుల్ గాంధీయే అనుకుంటారు. ఇతని పేరు మొహమ్మద్ ఫైసల్ చౌదరి ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ఇతన్ని అందరూ చోటా రాహుల్ అనే అంటారు. ఇతను కాంగ్రెస్ కార్యకర్త.

భారత్ జోడో యాత్రలో చాలా మంది ఇతనితో సెల్ఫీలు దిగితున్నారు. వారి సమస్యలు చెప్తున్నారు.

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన 23 ఏళ్ళ చౌదరి మీరట్లో కాంగ్రెస్ పార్టీ చురుకైన కార్యకర్త. ఢిల్లీలో జోడో యాత్రలో చేరిన ఆయన ఈ నెలాఖరులో శ్రీనగర్‌లో యాత్ర ముగిసే వరకు కొనసాగాలని భావిస్తున్నారు.

“మా నాన్న, తాత కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మారు. అలా నేను కూడా మూడేళ్ల క్రితం పార్టీలో చేరాను. ప్రజలు నన్ను రాహుల్‌గాంధీ అని తప్పుగా భావించడం నాకు భగవంతుడిచ్చిన వరం, ”అని అన్నారు.

చౌదరి ఎక్కడికి వెళ్లినా అతనికి సాదర స్వాగతం లభిస్తోంది. జోడో యాత్రలో అతన్ని చాలా సార్లు ప్రజలు రాహుల్ గాంధీ అని పొరబడుతున్నారు.

“కొన్నిసార్లు ప్రజలు నేను రాహుల్ నే అని అనుకుంటారు. వారు నన్ను కౌగిలించుకుంటారు లేదా నాకు పూలమాల వేస్తారు. రాహుల్ జీ కట్టుదిట్టమైన భద్రతతో నడుస్తాడు, కాబట్టి అందరూ అతన్ని కలవలేరు, కానీ నాకు ఎలాంటి భద్రత లేదు కాబట్టి వారు నాతో ఫోటోలు తీసుకుంటారు, ”అని అతను చెప్పాడు.

ఇప్పుడు భారత్ జోడో యాత్రలో చోటా రాహుల్ ఉరుఫ్ మొహమ్మద్ ఫైసల్ చౌదరి క్రేజ్ మామూలుగా లేదు. తెలియని వాళ్ళు రాహుల్ గాంధీ అని పొరబడితే తెలిసిన వాళ్ళు కూడా చాలా గౌరవం ఇస్తున్నారు. అతనితో సెల్ఫీలు దిగడానికి పోటీలు పడుతున్నారు.

First Published:  15 Jan 2023 6:21 AM GMT
Next Story