Telugu Global
National

ఆదిపురుష్‌ సినిమాపై మరో వివాదం... సెన్సార్‌ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు

కుల్దీప్ తివారీ దాఖలు చేసిన పిల్‌పై చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ బిఆర్ సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 21వ తేదీగా బెంచ్ నిర్ణయించింది.

ఆదిపురుష్‌ సినిమాపై మరో వివాదం... సెన్సార్‌ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు
X

‘ఆదిపురుష్’ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన పిల్‌పై సమాధానం ఇవ్వాల్సిందిగా సెన్సార్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసు జారీ చేసింది.

కుల్దీప్ తివారీ దాఖలు చేసిన పిల్‌పై చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ బిఆర్ సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 21వ తేదీగా బెంచ్ నిర్ణయించింది.

‘ఆదిపురుష్’మూవీ కథను ఓం రౌత్ రచించారు. దర్శకత్వం వహించారు. టి-సిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు నిర్మించాయి. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత‌గా, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి సర్టిఫికేట్ పొందకుండానే చిత్ర నిర్మాతలు సినిమా ప్రోమోను విడుదల చేశారని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సినిమాలో సీతా దేవిగా నటించిన కృతి సనన్ ధరించిన దుస్తులపై కూడా పిటిషన్‌లో అభ్యంతరాలు లేవనెత్తారు. రాముడు, సీతలను దేవతలుగా ప్రజలు గాఢంగా నమ్ముతారని, అయితే ఈ చిత్రం ఆ నమ్మకానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.

పిటిషనర్ తన పిటిషన్‌లో నటీనటులను,సినిమా నిర్మాత, దర్శకులను 'ప్రతివాదులు'గా చేసారు.

First Published:  14 Jan 2023 10:34 AM GMT
Next Story