Telugu Global
National

అరుణాచల్‌ప్రదేశ్ స‌రిహ‌ద్దుల్లో భార‌త్, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరువైపులా కొన్ని ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగా చర్చలు జరిగినా కొన్ని సమస్యలు ఇంకా అప‌రిష్కృతంగానే మిగిలాయి. స‌రిహద్దు వెంబడి సాయుధ దళాలు మౌలిక సదుపాయాలను పటిష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

అరుణాచల్‌ప్రదేశ్ స‌రిహ‌ద్దుల్లో భార‌త్, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ
X

భార‌త్‌, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణలు త‌లెత్తాయి. ఈ స‌మాచారం ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఈ నెల 9వ తేదీన ఈ ఘర్షణ జరిగింది. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఇరు దేశాల సైనికులు ఈ ప్రాతం నుండి వెనక్కు మ‌ళ్ళాయ‌ని అధికారులు తెలిపారు.

గత ఏడాది అక్టోబర్ నెల‌లో ఇదే ప్రాంతంలో చైనా ఆర్మీని ఇండియన్ ఆర్మీ అడ్డుకున్న విషయం తెలిసిందే. దాదాపు 200 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులను అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రశాంతత‌ నెలకొల్పే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.

2020 జూన్ నెల‌లో భారత్, చైనా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణలో ఓ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించిన విష‌యం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన సంతోష్ ఈ ఘర్షణలో మరణించారు. దేశంలోని మరో ఇద్దరు జవాన్లు మరణించారు. చైనాకు చెందిన సైనికులు కూడా ఈ ఘటనలో మృతి చెందారు. అంతకు ముందు కూడా సరిహద్దు వెంట రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరువైపులా కొన్ని ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగా చర్చలు జరిగినా కొన్ని సమస్యలు ఇంకా అప‌రిష్కృతంగానే మిగిలాయి. స‌రిహద్దు వెంబడి సాయుధ దళాలు మౌలిక సదుపాయాలను పటిష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంత‌కాలంపాటు శాంతియుతంగా ఉన్నా తాజాగా ఈ ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ‌డం తో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి.

First Published:  12 Dec 2022 4:47 PM GMT
Next Story