Telugu Global
National

ఫేక్ న్యూస్ తో బీజేపీకి ప్రచారం చేస్తున్న ఏఎన్ఐ..!

ఓ పథకంప్రకారం ANI కల్పిత వార్తలు రాస్తూ బీజేపీకి లబ్ధి చేకూరుస్తున్నట్టు ఈయూ డిస్‌ ఇన్ఫో ల్యాబ్‌ తెలిపింది. దీనికి పలు ఉదాహరణలు కూడా జోడించింది.

ఫేక్ న్యూస్ తో బీజేపీకి ప్రచారం చేస్తున్న ఏఎన్ఐ..!
X

ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ANI). భారతీయులకు తెలిసినంతవరకు ఇది ఒక మీడియా ఏజెన్సీ. కానీ ఇది కాషాయ ఏజెన్సీగా మారి చాలాకాలమైందని అంటోంది యూరోపియన్‌ నాన్‌-ప్రాఫిట్‌ గ్రూప్‌ ఈయూ డిస్‌ ఇన్ఫో ల్యాబ్‌. బీజేపీకి అనుకూల అసత్య కథనాలను వండివారుస్తూ ఆ పార్టీ తరపున తప్పుడు ప్రచారాలు చేస్తోందని వివరించింది. మేధోసంస్థలు, ప్రముఖ జర్నలిస్టులు పేర్కొన్నట్టు అంటూ ANI పలు సందర్భాల్లో ప్రచురించిన వార్తలు అబద్ధమని, ఆ ఏజెన్సీ పేర్కొనే మేధోసంస్థలు, జర్నలిస్టులు అసలు ఉనికిలోనే లేరని వెల్లడించింది.

బీజేపీకి లబ్ధి చేకూర్చేలా..

ఓ పథకంప్రకారం ANI కల్పిత వార్తలు రాస్తూ బీజేపీకి లబ్ధి చేకూరుస్తున్నట్టు ఈయూ డిస్‌ ఇన్ఫో ల్యాబ్‌ తెలిపింది. దీనికి పలు ఉదాహరణలు కూడా జోడించింది. ‘బ్యాడ్‌ సోర్సెస్‌: హౌ ఇండియన్‌ న్యూస్‌ ఏజెన్సీ ANI కోటెడ్‌ సోర్సెస్‌ దట్‌ డునాట్‌ ఎగ్జిస్ట్‌’ పేరిట ఓ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ANI తో పాటు ANI వార్తలను మక్కికి మక్కి అలాగే ప్రచురిస్తున్న భారత మీడియా సంస్థలు కూడా తమ కథనాలకు ఆధారాలను చూపించలేకపోతున్నాయని తెలిపింది. ANI స్టోరీలను దేశంలోని పలు వార్తా సంస్థలు ఏమాత్రం విశ్లేషించుకోకుండానే అలాగే ప్రచురిస్తున్నాయని, దేశంలో ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తికి ఇదీ ఒక కారణమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ANI ఫేక్‌ స్టోరీలు బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు.

2014, 2019లో జరిగిన ఎన్నికల్లో ANI బీజేపీకి అనుకూల వార్తలు ప్రసారం చేసిందని, దానికోసం పలు ఫేక్‌ ఆర్టికల్స్‌ సృష్టించిందని మీడియా పరిశోధన సంస్థలు క్యారవాన్‌, న్యూస్‌ లాండ్రీ గతంలో పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ANI వార్తల విశ్వసనీయతపై ఈయూ డిస్‌ ఇన్ఫో ల్యాబ్‌ గతంలో రెండుసార్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ నివేదికను ప్రచురించింది, ఈసారి ఏకంగా చిట్టా విప్పేసింది. ANI వార్తా ఏజెన్సీకి మాత్రమే ప్రధాని మోదీ, అమిత్‌ షా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడాన్ని కూడా ఈ వ్యూహంలో భాగమేనంటున్నారు. ANI వార్తల్ని ఉన్నది ఉన్నట్టు ప్రచురించే మీడియా సంస్థలు కూడా వాస్తవాలను నిర్థారించుకోవడంలేదంటున్నారు.

First Published:  25 Feb 2023 3:45 AM GMT
Next Story