Telugu Global
National

ప్రజ్ఞానంద‌ తల్లిదండ్రులకు ఆనంద్ మహేంద్ర అదిరిపోయే గిఫ్ట్

క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు మహీంద్ర అండ్‌ మహీంద్రకు చెందిన స్పెషల్‌ ఎడిషన్‌ వాహనాలను గిఫ్ట్‌గా ఇవ్వడం ఆనంద్ మహీంద్రాకు అలవాటు.

ప్రజ్ఞానంద‌ తల్లిదండ్రులకు ఆనంద్ మహేంద్ర అదిరిపోయే గిఫ్ట్
X

18 ఏళ్ల చెస్ సంచలనం ప్రజ్ఞానంద‌. ఫిడే వ‌ర‌ల్డ్ క‌ప్‌ ఫైనల్‌లో ఓడినా.. ప్రపంచ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌ను ముప్పుతిప్పలు పెట్టి కోట్లాది మంది భారతీయుల మనసులు గెలుచుకున్నాడు. అందుకే ప్రజ్ఞానంద్‌‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఎంతోమంది ప్రముఖులు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా ప్రజ్ఞానంద ప్రతిభను పొగుడుతూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఒక అభినందన ట్వీట్ చేయగానే అతని ఫాలోవర్లు ప్రజ్ఞానందకు మహీంద్ర థార్ బహుమతిగా ఇవ్వాలని కోరారు.


క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు మహీంద్ర అండ్‌ మహీంద్రకు చెందిన స్పెషల్‌ ఎడిషన్‌ వాహనాలను గిఫ్ట్‌గా ఇవ్వడం ఆనంద్ మహీంద్రాకు అలవాటు. ఈ నేపథ్యంలో నెటిజన్ల విజ్ఞప్తికి ఆయన స్పందించారు. అయితే, ఆ బహుమతిలో చిన్న మార్పు చేశారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులను పొగడ్తుల్లో ముంచెత్తుతూ వారిని నప్పే బహుమతిని ప్రకటించారు.

'ప్రజ్ఞానందకు థార్ వాహనాన్ని బహుమతిగా ఇవ్వమని చాలా మంది కోరుతున్నారు. కానీ, నాకు వేరే ఆలోచన ఉంది. ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్‌బాబుకు తమ కుమారుడిని చిన్నప్నటి నుంచి చదరంగం క్రీడలో ప్రోత్సహించి, ఈ స్థాయికి తీసుకొచ్చారు. వారికి కృతజ్ఞతగా, ప్రోత్సాహకరంగా, వారికి సరిపోయేలాగ మహీంద్ర XUV4OO EV వాహనాన్ని గిఫ్ట్‌గా ఇవ్వాలని భావిస్తున్నాను’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

తన సూచనను పరిశీలించాల్సిందిగా కోరుతూ కంపెనీకి చెందిన రాజేష్‌కు ట్యాగ్‌ చేశారు ఆనంద్ మహీంద్రా. దీంతో తక్షణమే స్పందించిన రాజేష్‌ త్వరలోనే ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400 ప్రత్యేక ఎడిషన్ అందించనున్నట్టు తెలిపారు. అలాగే తల్లిదండ్లులు తమ పిల్లలకు వీడియో గేమ్‍లకు బదులుగా చెస్ నేర్పించాలని పేరెంట్స్ కు సలహా ఇచ్చారు.

*

First Published:  29 Aug 2023 5:46 AM GMT
Next Story