Telugu Global
National

పౌరహక్కులు, వాక్ స్వాతంత్య్రం పై అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యలు... బీజేపీ, తృణమూల్ ల మధ్య ట్వీట్ల‌ యుద్దం

కోల్‌కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ స్ట్‌లో అమితాబ్ , బ్రిటీష్ కాలంనాటి సెన్సార్‌షిప్, మతతత్వవాదం గురించి మాట్లాడారు. ఆపై తనతోపాటు వేదికపై ఉన్న షారుఖ్ ఖాన్ ను ఉద్దేశించి: " ఇప్పుడు కూడా పౌర హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని వేదికపై ఉన్న నా సహచరులు అంగీకరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని వ్యాఖ్యానించారు.

పౌరహక్కులు, వాక్ స్వాతంత్య్రం పై అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యలు... బీజేపీ, తృణమూల్ ల మధ్య ట్వీట్ల‌ యుద్దం
X

పౌరహక్కులు, వాక్ స్వాతంత్య్రం పై అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ల మధ్య ట్వీట్ల వార్ కు దారి తీసింది.

కోల్‌కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో అమితాబ్ , బ్రిటీష్ కాలంనాటి సెన్సార్‌షిప్, మతతత్వవాదం గురించి మాట్లాడారు. ఆపై తనతోపాటు వేదికపై ఉన్న షారుఖ్ ఖాన్ ను ఉద్దేశించి: " ఇప్పుడు కూడా పౌర హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని వేదికపై ఉన్న నా సహచరులు అంగీకరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా, "అమితాబ్ బచ్చన్ మాటలు కోల్‌కతాలో అదే వేదికపై కూర్చున్న మమతా బెనర్జీకి సరిగ్గా సరిపోతాయి. ఆమె నిరంకుశత్వానికి ఆ మాటలు అద్దంపడతాయి.'' అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం ఆ నిరంకుశురాలి నాయకత్వంలో జరిగిన హింస ఘోరమైనది. బెంగాల్ ప్రతిష్టను ఆమె దిగజారుస్తున్నారు అని ఆయన విమర్శించారు.

ట్విట్టర్ లో అమిత్ మాల్వియా చేసిన విమర్షలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఘాటుగా స్పందించారు.

"సినిమాలను నిషేధించడం, జర్నలిస్టులను నిర్బంధించడం, నిజం మాట్లాడినందుకు సాధారణ ప్రజలను శిక్షించడం , భావవ్యక్తీకరణ స్వేచ్చపై ఆంక్షలు విధించడం వంటివి నిరంకుశ పాలనకు సంకేతాలు. ఇవన్నీ బీజేపీ పాలనలో జరుగుతున్నాయి. కానీ అమిత్ మాల్వీయ ఇతరులను నిందించే పనిలో బిజీగా ఉన్నారు" అని ఆమె అన్నారు.

మొత్తానికి షారూక్ హీరోగా, దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోన్న పఠాన్ మూవీని నిషేధించాలంటూ, బీజేపీ, ఇతర హిందూ సంఘాలు రచ్చ చేస్తున్న నేపథ్యంలో అమితాబ్ మాట్లాడిన మాటలు పెద్ద చర్చకే దారి తీశాయి.

మరో వైపు ఇదే వేడుకలో పాల్గొన్న షారూక్ ఖాన్ పఠాన్ మూవీ వివాదం గురించి, సోషల్ మీడియాలో 'బ్యాన్ పఠాన్' అనే హ్యాష్ ట్యాగ్ తో జరుగుతున్న ప్రచారంపై పరోక్షంగా స్పందించారు. ఇవి సంకుచిత పోకడలు, విభజన, విధ్వంస కారకాలు అంటూ మండి పడ్డారు.

First Published:  16 Dec 2022 9:58 AM GMT
Next Story