Telugu Global
National

'తేజ‌స్వి యాదవ్ పై అమిత్ షా కుట్ర చేసి కేసులో ఇరికించారు'

2017లోనే బిహార్ లో జెడియు‍,ఆర్జేడి నేతృత్వంలోని మ‌హాఘ‌ట్‌బంధ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బిజెపి ప్ర‌య‌త్నించింద‌ని జెడియు జాతీయ అద్య‌క్షుడు ల‌ల‌న్ సింగ్ తెలిపారు. ఇందుకోసం తేజ‌స్వియాద‌వ్ ను కుట్ర పూరితంగా ఐఆర్‌సిటిసీ కేసులో ఇరికించార‌ని ఆరోపించారు.

తేజ‌స్వి యాదవ్ పై అమిత్ షా కుట్ర చేసి కేసులో ఇరికించారు
X

విప‌క్ష‌ పార్టీల ప్ర‌భుత్వాల‌ను, కూట‌ముల‌ను ప‌డ‌గొట్ట‌డం బిజెపి నేత‌ల‌కు ఓ ఆట‌లా మారింది. ఇది ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిన ఆలోచ‌న కాదు. ఎప్ప‌టినుంచో కాషాయ పార్టీ చాప‌కింద నీరులా విప‌క్ష పాలిత రాష్ట్రాల‌లో పాగా వేసేందుకు దొడ్డిదోవ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. 2017లో బిహార్ లో జెడియు‍,ఆర్జేడి నేతృత్వంలోని మ‌హాఘ‌ట్‌బంధ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బిజెపి ప్ర‌య‌త్నించింద‌ని జెడియు జాతీయ అద్య‌క్షుడు ల‌ల‌న్ సింగ్ తెలిపారు. ఇందుకోసం తేజ‌స్వియాద‌వ్ ను కుట్ర పూరితంగా ఐఆర్‌సిటిసీ కేసులో ఇరికించార‌ని ఆరోపించారు. అమిత్ షా ఈ కుట్ర‌కు సూత్రధారి అని ల‌ల‌న్ వెల్ల‌డించారు. అప్పుడు ఆర్జెడీ, మ‌హాఘ‌ట్ బంధ‌న్ కూట‌మి నుంచి వీడి పోవ‌డం మేము చేసిన పెద్ద త‌ప్పు. దీనికంత‌టికీ కార‌ణం అమిత్ షా చేసిన కుట్ర‌లే అని చెప్పారు. నితీష్ కుమార్ ను వెన్నుపోటుదారుడంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను ల‌ల‌న్ ఖండించారు.

మ‌హాఘ‌ట్ బంధ‌న్ లో భాగంగా ఉన్న త‌మ పార్టీని కూట‌మినుంచి బ‌య‌టికి వ‌చ్చేయాల‌ని, వారంతా అవినీతి కేసుల్లో చిక్కుకున్నార‌ని అమిత్ షా ఒత్తిడి తెచ్చారు. తేజ‌స్వి యాద‌వ్ చుట్టూ ఉచ్చు బిగించి ఆయ‌న్ను ఐఆర్‌సిటిసి కేసులో ఇరికించార‌ని అన్నారు. అప్ప‌టి కేసు నేటికీ తేల‌లేద‌ని అన్నారు. బిజెపితో స‌ఖ్య‌త‌గా ఉంటే ఎటువంటి లోపాలు క‌న‌బ‌డ‌వ‌ని లేక‌పోతే అన్నీ ఆరోప‌ణ‌లు చేస్తార‌ని ల‌ల‌న్ విమ‌ర్శించారు. నితీష్ బిజెపికి మద్దతు ఉపసంహరించుకోగానే ఈ కేసులో తేజ‌స్వి యాద‌వ్ కు బెయిల్ ర‌ద్దు చేసిన‌ట్టు వార్తా ప‌త్రిక‌ల్లో చూశామ‌ని చెప్పారు. న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఈ ఐదేళ్ళు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు. సిబిఐని అమిత్ షా పంజ‌రంలో చిల‌క‌లా ఎందుకు మార్చారు అని ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వ త‌ప్పుడు చ‌ర్య‌ల వ‌ల్ల సిబిఐ త‌న విశ్వ‌స‌నీయ‌త కోల్పోయింద‌ని అన్నారు.

అమిత్ షా పూర్ణియా స‌భ‌లో అన్నీ అవాస్త‌వాలే మాట్లాడార‌ని, ప్ర‌జ‌ల‌తో అడిగి చ‌ప్ప‌ట్టు కొట్టించుకున్నార‌ని అన్నారు. పూర్ణియాలో విమానాశ్ర‌యం ఎప్పుడో పూర్తి అయిపోయింద‌ని అమిత్ షా అబ‌ద్దాలు చెప్పారు. వాస్త‌వానికి ఆ విమానాశ్ర‌యానికి శంకుస్థాప‌న కూడా జ‌ర‌గ‌లేద‌ని ల‌ల‌న్ వివ‌రించారు. అక్క‌డ ఎయిర్ పోర్టు లేద‌ని పూర్ణియా ప్ర‌జ‌ల‌కు కూడా తెలుసున‌ని అన్నారు.

First Published:  26 Sep 2022 8:25 AM GMT
Next Story