Telugu Global
National

విష‍ం కలిపారనే అనుమానంతో పోలీసులిచ్చిన టీ ని తాగనిరాకరించిన అఖిలేష్ యాదవ్

ట్విట్టర్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ కార్యకర్త మనీష్ జగన్ అగర్వాల్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆదివారం ఆయనను అరెస్ట్‌ చేశారు. దీనికి వ్యతిరేకంగా లక్నోలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

విష‍ం కలిపారనే అనుమానంతో పోలీసులిచ్చిన టీ ని తాగనిరాకరించిన అఖిలేష్ యాదవ్
X

సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పోలీసులిచ్చిన టీని తాగడానికి నిరాకరించారు. అందులో విషం కలిపారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.

ట్విట్టర్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ కార్యకర్త మనీష్ జగన్ అగర్వాల్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆదివారం ఆయనను అరెస్ట్‌ చేశారు. దీనికి వ్యతిరేకంగా లక్నోలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అఖిలేష్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అఖిలేష్ కు టీ ఆఫర్ చేశారు. అప్పుడు అఖిలేష్, ''నేను మీరిచ్చిన టీ తాగను. అందులో విషం కలిపారేమో ? మిమ్మల్ని నేను నమ్మను. ఒక వేళ నేను టీ తాగాలనుకుంటే బైటి నుంచి తెప్పించుకొని తాగుతాను'' అని అన్నాడు.

కాగా, స్వామి ప్రసాద్ మౌర్య నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మనీష్ జగన్ అగర్వాల్‌ను విడుదల చేయాలని కోరుతూ డీజీపీ ప్రధాన కార్యాలయం గేట్ వెలుపల నిరసన చేపట్టారు.

లక్నోలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నిరసన‌ తర్వాత, మనీష్ అగర్వాల్‌ను కలిసేందుకు అఖిలేష్ యాదవ్ గోసాయిగంజ్ జిల్లా జైలుకు వెళ్ళారు.

పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ట్విట్టర్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మనీష్ జగన్ అగర్వాల్‌పై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదైన తర్వాత లక్నో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

"సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త మనీష్ జగన్ అగర్వాల్‌ను లక్నో పోలీసులు అరెస్టు చేయడం ఖండించదగినదే కాదు సిగ్గుచేటు కూడా, పోలీసులు వెంటనే అతన్ని విడుదల చేయాలి" అని ఎస్పీ అధికారిక ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు.

First Published:  8 Jan 2023 10:01 AM GMT
Next Story