Telugu Global
National

శృంగారం విషయమై గొడవ.. బావిలో దూకిన భార్యను కాపాడి.. ఆ తర్వాత కొట్టి చంపిన భర్త

శృంగారం విషయమై గొడవ.. బావిలో దూకిన భార్యను కాపాడి.. ఆ తర్వాత కొట్టి చంపిన భర్త
X

శృంగారం విషయమై దంపతుల మధ్య గొడవ జరగ్గా.. బావిలో దూకిన భార్యను కాపాడిన భర్త ఒడ్డుకు వచ్చిన తర్వాత మరోసారి భార్యతో గొడవ పెట్టుకుని ఆమెను కొట్టి చంపాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం జష్‌పూర్ జిల్లాలో జరిగింది. శంకర్ రామ్, ఆశాబాయి దంపతులు సోమవారం రాత్రి కలసి మద్యం సేవించారు. ఆ తర్వాత ఆశాబాయి నిద్రకు ఉపక్రమిస్తుండగా శృంగారంలో పాల్గొనాలని శంకర్ రామ్ కోరాడు. అందుకు ఆశాబాయి నిరాకరించడంతో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది.

ఈ ఘటన తర్వాత ఆశాబాయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని గ్రామ సమీపంలోని బావిలో దూకింది. వెంటనే అక్కడికి చేరుకున్న శంకర్ రామ్ బావిలో దూకి భార్యను కాపాడాడు. ఒడ్డుకు వచ్చిన తర్వాత భార్యతో మళ్లీ వాగ్వాదానికి దిగాడు. ఇంత చిన్న విషయానికే బావిలో దూకాలా..? అంటూ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవ కాస్త‌ పెద్దది కావడంతో ఆగ్రహించిన శంకర్ రామ్ ఆశాబాయి ప్రైవేటు పార్ట్స్ పై దాడి చేశాడు. తీవ్ర గాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

రాత్రంతా శంకర్ రామ్ భార్య మృతదేహం పక్కనే కూర్చున్నాడు. తెల్లవారిన తర్వాత గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ఆశాబాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శంకర్ రామ్ ను అరెస్టు చేసి కేసు న‌మోదు చేసిన‌ట్లు స్టేషన్‌ ఇన్‌చార్జి జగ్సే పంక్రా తెలిపారు. శృంగారం విషయమై తలెత్తిన చిన్న గొడవ కారణంగా భార్యను దారుణంగా కొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది.

First Published:  19 April 2023 2:38 PM GMT
Next Story