Telugu Global
National

బీజేపీలో చేరుతున్నా.. కుమార‌స్వామికి మ‌ద్ద‌తిస్తున్నా

2019 ఎన్నికల్లో సుమ‌ల‌త స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌స‌భ‌కు పోటీ చేశారు. కర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, జేడీఎస్ నేత కుమార‌స్వామిపై గెలిచి సంచ‌ల‌నం సృష్టించారు.

బీజేపీలో చేరుతున్నా.. కుమార‌స్వామికి మ‌ద్ద‌తిస్తున్నా
X

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన అల‌నాటి న‌టి సుమ‌ల‌త కొన్నాళ్లుగా క‌న్న‌డ రాజ‌కీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఆమె భ‌ర్త, క‌న్న‌ట న‌టుడు అంబ‌రీష్ రెండుసార్లు క‌ర్ణాట‌క‌లోని మండ్య నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ పని చేశారు. అంబ‌రీష్ మ‌ర‌ణం త‌ర్వాత సుమ‌ల‌త అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌స‌భ‌కు పోటీ చేసి గెలిచారు. అయితే తాను బీజేపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు సుమ‌లత బుధ‌వారం ప్ర‌క‌టించారు.

జేడీఎస్ అభ్య‌ర్థి కుమార‌స్వామికి మద్దతు

2019 ఎన్నికల్లో సుమ‌ల‌త స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌స‌భ‌కు పోటీ చేశారు. కర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, జేడీఎస్ నేత కుమార‌స్వామిపై గెలిచి సంచ‌ల‌నం సృష్టించారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌ద్ద‌తు ఆమెకు బాగా ఉప‌క‌రించింది. ఈ ఎన్నిక‌ల్లో మాండ్య టికెట్ త‌న‌కు ఇస్తార‌ని ఆమె ఆశించారు. అయితే క‌ర్ణాట‌క‌లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆ పార్టీకి 3 ఎంపీ స్థానాలు కేటాయించింది. అందులో మండ్య కూడా ఒక‌టి. ఈ స్థానం నుంచి బీజేపీ-జేడీ(ఎస్) కూటమి అభ్య‌ర్థిగా కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌కే త‌న మ‌ద్దతు అని సుమ‌ల‌త ప్ర‌క‌టించారు.

మండ్య‌ను వీడ‌ను

ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనప్పటికీ మండ్యను వీడనని సుమ‌లత స్ప‌ష్టం చేశారు. మండ్య‌లో తాను ఇండిపెండెంట్‌గా గెలిచిన‌ప్ప‌టికీ కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఇక్క‌డ రూ.4వేల కోట్ల‌తో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. అందుకే తాను బీజేపీలో చేరుతున్నాన‌ని సుమ‌లత చెప్పారు.

First Published:  3 April 2024 3:51 PM GMT
Next Story