Telugu Global
National

మెజార్టీ లేకున్నా గెలవాలనుకున్న బీజేపీకి షాక్...ఢిల్లీ మేయ‌ర్ పీఠాన్ని గెల్చుకున్న ఆప్

ఆప్‌కి చెందిన షెల్లీ ఒబెరాయ్ కి 150 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. ఒబెరాయ్‌ విజయంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు గెలిచారు, గూండాయిజం ఓడిపోయింది అన్నారు.

మెజార్టీ లేకున్నా గెలవాలనుకున్న బీజేపీకి షాక్...ఢిల్లీ మేయ‌ర్ పీఠాన్ని గెల్చుకున్న ఆప్
X

మెజార్టీ లేకున్నా ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న బీజేపీ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తా పై 34 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఆప్‌కి చెందిన షెల్లీ ఒబెరాయ్ కి 150 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. ఒబెరాయ్‌ విజయంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు గెలిచారు, గూండాయిజం ఓడిపోయింది అన్నారు.

MCD సభలో మొదటిసారి ప్రసంగించిన ఒబెరాయ్, కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. DMC చట్టం యొక్క నిబంధనలను పాటిస్తానని, నియమాలు, నిబంధనల ప్రకారం MCDని నడుపుతానని చెప్పారు. ఢిల్లీ ప్రజల కలలను నెరవేర్చేందుకు అందరం కలిసి పనిచేస్తామని ఆమె తెలిపారు.

ఒబెరాయ్ ఢిల్లీ యూనివర్శిటీలో మాజీ విజిటింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. మొదటి సారి కౌన్సిలర్ అయ్యారు,

ఫలితాలు ప్రకటించిన తర్వాత, ప్రిసైడింగ్ ఆఫీసర్, BJP నేత సత్య శర్మ నుండి ఒబెరాయ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలకు ఆమె అధ్యక్షత వహిస్తారు.

మేయ‌ర్ ఎన్నిక విష‌యంలో ఇప్ప‌టికే మూడుసార్లు మున్సిప‌ల్ స‌మావేశం వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఆప్‌, బీజేపీ మ‌ధ్య వాగ్వాదం వ‌ల్ల .. మేయ‌ర్ ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అయితే ఇవాళ నాలుగోసారి స‌మావేశ‌మైన ఎంసీడీ.. చివ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించింది. ఈ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు ఓటేయడానికి వీలు లేదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంతో ఆప్ విజయం సాధించింది.

First Published:  22 Feb 2023 9:41 AM GMT
Next Story