Telugu Global
National

రైల్‌లో సామూహిక నమాజ్.. వైరల్ అవుతున్న వీడియో..?

రైలులో ప్రయాణికులు నడిచే ప్రదేశంలో నమాజ్ చేశారని, రైలు ఖద్దా రైల్వే స్టేషన్లో ఆగినపుడు ఎక్కేవారు, దిగేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బీజేపీ నేతలు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రైల్‌లో సామూహిక నమాజ్.. వైరల్ అవుతున్న వీడియో..?
X

ఉత్తర ప్రదేశ్‌లో బహిరంగ నమాజ్‌పై ఆంక్షలు ఉన్నాయి. ఇటీవల లులు మాల్‌లో బహిరంగ ప్రదేశంలో కొంతమంది నమాజ్ చేయడంతో అక్కడి సిబ్బందిపై వేటు పడింది. తాజాగా ఇప్పుడు సత్యాగ్రహ్ ఎక్స్‌ప్రెస్‌లో నలుగురు ముస్లింలు నమాజ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే దీప్లాన్ భారతి. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.

రైలులో నమాజ్ చేస్తే తప్పా..?

రైలులో నమాజ్ చేయడం తప్పా ఒప్పా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. నమాజ్ సమయానికి ముస్లింలు ఎక్కడ ఉన్నా దైవ ప్రార్థనకు ఆటంకం లేకుండా చూసుకుంటారు. రైలులో ఉన్నా కూడా వారు నమాజ్‌ని వదులుకోరు. అయితే ఇక్కడ రైలులో ప్రయాణికులు ఈ నమాజ్ వల్ల ఇబ్బంది పడ్డారనేది బీజేపీ నేతల ఆరోపణ. రైలులో ప్రయాణికులు నడిచే ప్రదేశంలో నమాజ్ చేశారని, రైలు ఖద్దా రైల్వే స్టేషన్లో ఆగినపుడు ఎక్కేవారు, దిగేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన అక్టోబర్ 20న జరిగినట్టు చెబుతున్నారు. వారు నమాజ్ చేస్తున్నప్పుడు మరికొంతమంది దారి వద్ద ఉండి అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారని కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఆ రోజు ప్రయాణికులెవరైనా తమకు అసౌకర్యం కలిగింది అంటూ ఫిర్యాదు చేశారా అని ఆరా తీస్తున్నారు.

First Published:  22 Oct 2022 7:56 AM GMT
Next Story