Telugu Global
National

ఇత‌ని భార్య‌తో అత‌ను ప‌రార్‌.. అత‌ని భార్య‌తో ఇత‌ని పెళ్లి.. - బీహార్‌లో విచిత్రం

నీర‌జ్‌కు అప్ప‌టికే న‌లుగురు సంతానం ఉండ‌గా, ముఖేశ్‌కి ముగ్గురు సంతానం. ముఖేశ్ త‌న ప్రియురాలితో వెళ్లిపోయేట‌ప్పుడు త‌న ముగ్గురు పిల్ల‌ల‌నూ తీసుకుని వెళ్లిపోయాడు.

ఇత‌ని భార్య‌తో అత‌ను ప‌రార్‌.. అత‌ని భార్య‌తో ఇత‌ని పెళ్లి.. - బీహార్‌లో విచిత్రం
X

ఒక వ్యక్తి భార్య‌తో మ‌రో వ్య‌క్తి ప‌రార‌య్యాడు. దీనికి ప్ర‌తిగా నిందితుడి భార్య‌ను బాధితుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ విచిత్ర ఉదంతం బీహార్‌లో చోటుచేసుకుంది. ఖ‌గాఢియా జిల్లా ఛౌథామ్ బ్లాక్‌లోని హార్దియా గ్రామానికి చెందిన ముఖేశ్‌.. నీర‌జ్ భార్యతో ప‌రార‌య్యాడు. అనంత‌రం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విష‌యంపై గ్రామ పెద్ద‌లు పంచాయితీ పెట్ట‌గా.. ముఖేశ్ త‌న ప్రియురాలిని వ‌దిలి ఉండలేన‌ని స్ప‌ష్టం చేశాడు.

దీంతో ముఖేశ్‌పై ప‌గ పెంచుకున్న బాధితుడు నీర‌జ్... అత‌ని మొద‌టి భార్యతో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఆమెను ఒప్పించి.. ఈ నెల 18న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఈ వ్య‌వ‌హారం స్థానికంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నీర‌జ్‌కు అప్ప‌టికే న‌లుగురు సంతానం ఉండ‌గా, ముఖేశ్‌కి ముగ్గురు సంతానం. ముఖేశ్ త‌న ప్రియురాలితో వెళ్లిపోయేట‌ప్పుడు త‌న ముగ్గురు పిల్ల‌ల‌నూ తీసుకుని వెళ్లిపోయాడు. వీరి ఉదంతంలో మ‌రో ఆస‌క్తిక‌ర అంశ‌మేమిటంటే.. ముఖేశ్‌, నీర‌జ్‌ల భార్య‌ల పేర్లు ఒక‌టే కావ‌డం. ఇద్ద‌రి పేర్లూ రూబీయే.

మ‌రో అంశ‌మేమిటంటే.. ముఖేశ్‌తో వెళ్లిపోయిన రూబీకి ఆమెకు వివాహం కాక‌ముందు నుంచే ప‌రిచ‌యం ఉంది. పెళ్లికి ముందు అత‌న్ని ప్రేమించింది. నీర‌జ్‌తో ఆమెకు పెళ్ల‌యిన‌ త‌ర్వాత కూడా ముఖేశ్‌తో ప‌రిచ‌యాన్ని కొన‌సాగించింది. ఈ క్ర‌మంలో గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో వీరిద్ద‌రూ ఇంటినుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.

ఈ విష‌యంపై నీర‌జ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఆ త‌ర్వాత దీనిని గ్రామ పెద్ద‌లు పంచాయితీ ద్వారా తేల్చాల‌ని ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో నీర‌జ్‌.. ముఖేశ్‌ భార్య‌ను వివాహం చేసుకున్నాడు. నీర‌జ్ ప్రైవేటు ఉద్యోగి కాగా, ముఖేశ్ రోజు కూలీగా ప‌నిచేస్తున్నాడు.

First Published:  28 Feb 2023 3:47 AM GMT
Next Story