Telugu Global
National

90 మందికి ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ఢిల్లీలో కలకలం..

90మంది నమూనాల విషయంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కనపడిందని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ అత్యధిక వేగంతో వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉందని చెబుతున్నారు.

90 మందికి ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ఢిల్లీలో కలకలం..
X

ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడింది. దాని పేరు బీఏ 2.75 గతంలో వచ్చిన సబ్ వేరియంట్ కంటే ఇది భిన్నంగా ఉంది. టీకాలు తీసుకున్నా, తీసుకోకపోయినా దీని ముందు అందరూ సమానమే. అప్పుడే కరోనా నుంచి బయటపడినా,అసలిప్పటి వరకు కరోనా రాకుండా జాగ్రత్తపడినా, యాంటీబాడీలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నా దీనిముందు బలాదూర్. ఈ సబ్ వేరియంట్ వ్యాప్తి కూడా చాలా స్పీడ్ గా ఉంటుందని అంటున్నారు.

ఢిల్లీలో కలకలం..

ఢిల్లీలో కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఫిబ్రవరి నెల తర్వాత అత్యధికంగా గత మంగళవారం కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 2వేలకు పైగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కరోనా నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపించారు అధికారులు. దీంతో అసలు విషయం బయట పడింది. 90మంది నమూనాల విషయంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కనపడిందని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ అత్యధిక వేగంతో వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉందని చెబుతున్నారు.

స్వాతంత్ర దినోత్సవాల వేళ..

స్వాతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలతోపాటు, ర్యాలీలు, సామూహిక కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవాలపై పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం కనిపించే అవకాశముంది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కేసుల పెరుగుదలపై దృష్టిసారించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 15.41శాతం కాగా, కరోనా కారణంగా మంగళవారం ఏడుగురు మృతిచెందారు.

First Published:  11 Aug 2022 2:40 AM GMT
Next Story