Telugu Global
National

మోదీ ఇంటికి 467 కోట్లు ఖర్చు..

పేదవాడికి సొంత ఇల్లు రాలేదు కానీ, దేశంలో ప్రధానికి మాత్రం సొంత విల్లా వచ్చేస్తోంది. అది అలాంటిలాంటి విల్లా కాదు. దానికోసం ఏకంగా 467 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

మోదీ ఇంటికి 467 కోట్లు ఖర్చు..
X

2022 నాటికి దేశంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది నా కల. అది అలాంటిలాంటి ఇల్లు కాదు. అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు. ఇదీ ఎన్నికల వేళ మోదీ ఇచ్చిన హామీ. ఆ హామీ అమలు ఎంతవరకు వచ్చిందో అందరికీ తెలుసు. ఎంతమంది సొంత ఇంటి కలను కేంద్రం నెరవేర్చిందో వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. దేశంలో పేదవాడికి సొంత ఇల్లు రాలేదు కానీ, దేశంలో ప్రధానికి మాత్రం సొంత విల్లా వచ్చేస్తోంది. అది అలాంటిలాంటి విల్లా కాదు. దానికోసం ఏకంగా 467 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సెంట్రల్ విస్టా రీ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైనది ప్రధాని నివాసమే కావడం విశేషం.

ఆ సౌకర్యాలు వింటేనే మతిపోతుంది..

మొత్తం విస్తీర్ణం.. 2,26,203 చదరపు అడుగులు

బిల్టప్ ఏరియాలో ప్రధాని నివాసం విస్తీర్ణం 36,328 చదరపు అడుగులు

ఖర్చు అంచనా రూ.467 కోట్లు

పీఎం హోమ్ ఆఫీస్, ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఏరియా, సపోర్టింగ్ స్టాఫ్ క్వార్టర్స్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) కార్యాలయం, సేవా సదన్..

భూగర్భంలో వీఐపీ సొరంగం, పీఎం హోమ్ ఆఫీస్ నుండి నేరుగా ఆ సొరంగంలోకి వెళ్లొచ్చు. ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్ కి, ప్రధాని నివాసానికి ఇది అనుసంధానంగా ఉంటుంది.

సొరంగం ఎందుకంటే..?

సెంట్రల్ విస్టా ప్రాంగణం నుంచి ప్రధాని బయలుదేరారంటే మందీ మార్బలం కూడా కదలాల్సిందే. ఆయనకోసం ట్రాఫిక్ ఆంక్షలు, బారికేడింగ్ వ్యవస్థతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందుకే ప్రధాని కోసం సొరంగం తవ్వారు. ఆ సొరంగం నుంచి నేరుగా ప్రధాని సెంట్రల్ విస్టానుంచి బయటకు వెళ్లిపోవచ్చు.

2024లోపు పూర్తి చేయాలి..

ప్రధాని నివాసానికి, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కి కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ నిధులు కేటాయిస్తోంది. ప్రధాని నివాసాన్ని 2024లోగా పూర్తి చేయాలని టార్గెట్ నిర్ణయించుకున్నారు. ఆర్థిక కమిటీ 467కోట్ల రూపాయల ఈ ప్రాజెక్ట్ కి నామమాత్రపు ఆమోదం తెలపాల్సి ఉంది. 2022-23 బడ్జెట్ లో ఈ ప్రాజెక్ట్ కోసం 70కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటికే పర్యావరణ అనుమతి పొందగా, మిగతా అనుమతులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ప్రధాని నివాసం పూర్తయితే.. ఇప్పటికే సౌత్ బ్లాక్‌ లో ఉన్న పీఎంవో చివరికి మ్యూజియంగా మారిపోతుంది.

First Published:  8 Aug 2022 12:05 PM GMT
Next Story