Telugu Global
National

బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 18 బస్సులు

పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగ కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 18 బస్సులు
X

బెంగళూరులోని వీరభద్రనగర్‌ సమీపంలోఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ ప్రైవేట్‌ డిపోలో పార్క్‌ చేసిన 18 బస్సులు పూర్తిగా దగ్ధ‌మయ్యాయి. సోమవారం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే 18 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్ల‌లేదు.

అగ్ని ప్ర‌మాద‌ ఘటనకు కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. డిపోలో మండే స్వభావం గల అనేక వ‌స్తువులు, పదార్థాలు ఉన్నాయని ఫైర్ సేఫ్టీ సిబ్బంది తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. బస్‌ డిపోకు సమీపంలోనే ఓ గ్యారెజ్ ఉంది. గ్యారెజ్‌లో చేసే వెల్డింగ్ ఇతర పనుల వల్ల కూడా మంటలు చెలరేగే అవకాశం ఉందన్నారు ఫైర్ సెఫ్టీ అధికారులు. అయితే కచ్చితంగా మంటలకు కారణం ఇదే అని చెప్పలేమన్నారు.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగ కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో డిపోలో 30కి పైగా బస్సులున్నాయి. గతంలో బెంగళూరు సిటీలోని ఓ క్రాకర్‌ షాప్‌లో మంటలు చెలరేగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కోరమంగళలో రూప్‌టాప్‌ రెస్టారెంట్‌, హజ్‌భవన్‌లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా పెద్దఎత్తున ఆస్తినష్టం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం శివకుమార్‌.. విచారణకు ఆదేశించారు. సిటీలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా త్వరలోనే పక్కా ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

First Published:  31 Oct 2023 2:10 AM GMT
Next Story