Telugu Global
National

కవిత దీక్షకు 16 పార్టీల నేతలు.. ఢిల్లీలో విపక్షాల బలప్రదర్శన

ఏకంగా 16 పార్టీల నేతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగుతున్నారనేసరికి జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

కవిత దీక్షకు 16 పార్టీల నేతలు.. ఢిల్లీలో విపక్షాల బలప్రదర్శన
X

బీజేపీ ఆధిపత్యానికి కాలం చెల్లే టైమ్ దగ్గరపడిందా..? కమలదళానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయా..? దర్యాప్తు సంస్థల పేరుతో మోదీ ప్రభుత్వం విపక్షాలను బలహీనం చేయాలని చూస్తుంటే.. వారంతా ఏకమై మరింత బలం పుంజుకునేలా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి. ఇటీవలే ప్రధాని మోదీకి 8 పార్టీలకు చెందిన 9మంది నేతలు ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు 16 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరాహార దీక్ష కేంద్రానికి మింగుడుపడటం లేదు. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఈ దీక్ష జరగాల్సి ఉంది. మహిళా బిల్లుకోసం ఈ దీక్ష చేపట్టబోతున్నట్టు కవిత పిలుపునిచ్చిన సమయంలో ఇంత మద్దతు లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఏకంగా 16 పార్టీల నేతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగుతున్నారనేసరికి జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

బీఆర్ఎస్ నేత కవిత ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లుకోసం నిరసన దీక్ష జరగాల్సి ఉంది. ఈ దీక్షకు బీఆర్ఎస్ నేతలతోపాటు.. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాలీ దళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఆప్, ఆర్ఎల్డీ, జేఎమ్ఎమ్ పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. రాజ్యసభ సభ్యులు కపిల్ సిబల్ కూడా ఈ నిరసనకు హాజరు కాబోతున్నారు. ఒకరకంగా జంతర్ మంతర్ వేదికగా ఇది విపక్షాలు బలపదర్శన అనుకోవచ్చు.

ఢిల్లీ వేదికగా నిరసన దీక్షకు కవిత పిలునిచ్చిన రెండురోజులకు ఆమెకు ఈడీనుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఈడీ ముందు ఆమె హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకిచ్చిన నోటీసులపై విపక్షాలు భగ్గుమన్నాయి. దీక్ష విషయంలో ఆమెను భయపెట్టేందుకే ఇలా నోటీసులు జారీ చేశారంటూ మండిపడ్డారు విపక్షాల నేతలు.

16 పార్టీలు, 29 రాష్ట్రాలు..

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి, ఆమోదించాలనే డిమాండ్ తో “భారత్ జాగృతి” ఆధ్వర్యంలో రేపు నిరాహార దీక్ష జరగాల్సి ఉంది. జంతర్ మంతర్ దగ్గర జరగబోయే దీక్షకు 29 రాష్ట్రాలకు చెందిన 16 పార్టీల నేతలు హాజరవుతారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీతారాం ఏచూరి, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంకా చతుర్వేది హాజరవుతారు. ముగింపు కార్యక్రమానికి సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, తృణమూల్ కాంగ్రెస్ నేత సుస్మిత దేవ్, జేడీయూ నేత త్యాగి హాజరవుతారని తెలిపారు.

First Published:  9 March 2023 6:51 AM GMT
Next Story