Telugu Global
National

15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలన్నీ ఇక తుక్కే

15 ఏళ్లు దాటిన వాహనాలను వినియోగించకుండా పక్కనపెట్టడమే మంచిదని తాము భావిస్తున్నామని, రాష్ట్రాలు కూడా తమ ఆదేశాలు పాటించాలని చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలన్నీ ఇక తుక్కే
X

భారత ప్రభుత్వం వినియోగిస్తున్న వాహనాల్లో 15ఏళ్లు దాటినవాటన్నిటినీ ఇక తుక్కుకింద జమచేస్తారు. ఈమేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్రాల్లో కూడా ఇకపై పాత వాహనాలను వినియోగించకుండా చూడాలన్నారు. ఈమేరకు కేంద్రం రూపొందించిన విధానాన్ని రాష్ట్రాలకు పంపామని చెప్పారు నితిన్ గడ్కరీ. వార్షిక వ్యవసాయ విజన్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం ఆల్రడీ ఈమేరకు నిర్ణయం తీసుకుందని, ఆ ఫైల్ పై ప్రధానితోపాటు, తాను కూడా సంతకం చేశానన్నారు నితిన్ గడ్కరీ. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్న వాహనాల విషయంలో తుది నిర్ణయం ఆయా ప్రభుత్వాలదేనన్నారు. కానీ 15 ఏళ్లు దాటిన వాహనాలను వినియోగించకుండా పక్కనపెట్టడమే మంచిదని తాము భావిస్తున్నామని, రాష్ట్రాలు కూడా తమ ఆదేశాలు పాటించాలని చెప్పారు గడ్కరీ.

వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతకు శాశ్వత పరిష్కారం..

వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత కారణంగా వాతావరణం కలుషితమవుతుంది. దీనివల్ల ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో శీతాకాలంలో కాలుష్య సమస్య తీవ్రమవుతోంది. ఈ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు గడ్కరీ. పానిపట్‌ లో ఇండియన్ ఆయిల్‌ కు చెందిన రెండు ప్లాంట్లు ప్రారంభమవుతున్నాయని, అందులో ఒకటి రోజుకు లక్ష లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తుందని, మరొకటి వరి గడ్డిని ఉపయోగించి రోజుకు 150 టన్నుల బయో-బిటుమెన్‌ ను తయారు చేస్తుందని చెప్పారు. బయోబిటుమెన్ ని రోడ్లు వేసేందుకు తారుకి ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. దీని ద్వారా తారు దిగుమతి చేసుకునే అవసరం కూడా ఉండదని అన్నారు గడ్కరీ. రైతులు పండించిన వరి గడ్డిని ఉపయోగించి గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, జాతీయ రహదారులపై తారు రోడ్లు వేస్తామన్నారు. బంజరు భూముల్లో పండించే వెదురు ద్వారా ఇథనాల్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు.

First Published:  25 Nov 2022 2:34 PM GMT
Next Story