Telugu Global
National

పొగ మంచు వల్ల ప్రమాదం.. 12 మంది మృతి

తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీళ్లంతా గోలఘాట్‌లోని కమర్‌గావ్ నుంచి తిన్‌సుకియా జిల్లాలోని తిలింగ మందిర్‌కు వెళ్తున్నారు.

పొగ మంచు వల్ల ప్రమాదం.. 12 మంది మృతి
X

అస్సాంలోని గోలఘాట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్రలో విషాదం నెలకొంది. బొగ్గు లోడుతో ఎదురుగా వస్తున్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఢీకొంది. దీంతో 12 మంది స్పాట్‌లోనే చనిపోయారు. మృతుల్లో రెండు వాహనాల డ్రైవర్లు కూడా ఉన్నారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీళ్లంతా గోలఘాట్‌లోని కమర్‌గావ్ నుంచి తిన్‌సుకియా జిల్లాలోని తిలింగ మందిర్‌కు వెళ్తున్నారు. ఇంతలోనే ఇలా విషాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని దేర్గావ్ సివిల్ హాస్పిటల్‌కు, సీరియస్‌గా ఉన్నవాళ్లను జోర్హాట్ మెడికల్ కాలేజీకి తరలించారు. పొగమంచువల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు.

First Published:  3 Jan 2024 5:35 AM GMT
Next Story