Telugu Global
National

ఛత్తీస్‌గఢ్‌ లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. 11 మంది పోలీసుల మృతి!

మావోయిస్టులున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో వారిపై దాడి చేయడానికి గురువారం నాడు పోలీసులు వాహనంలో వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారంతా డిస్ట్రిక్ట్ రిజర్వుడు గార్డు(డీఆర్‌డీ)కు చెందినవారు.

ఛత్తీస్‌గఢ్‌ లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. 11 మంది పోలీసుల మృతి!
X

మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)తో పోలీసులు ప్రయాణిస్తున్న వాహ‌నాన్ని పేల్చివేయడంతో పది మంది పోలీసులు, డ్రైవర్ మరణించారు.

మావోయిస్టులున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో వారిపై దాడి చేయడానికి గురువారం నాడు పోలీసులు వాహనంలో వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారంతా డిస్ట్రిక్ట్ రిజర్వుడు గార్డు(డీఆర్‌డీ)కు చెందినవారు.

దాడి అనంతరం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.

''దంతెవాడలోని అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు క్యాడర్ ఉన్నారన్న సమాచారంతో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కోసం వచ్చిన డీఆర్‌జీ దళం లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. ఈ సంఘటనలో మా 10 మంది డీఆర్‌జీ జవాన్లు, డ్రైవర్‌ వీరమరణం పొందారనే వార్త చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యుల దుఃఖాన్ని మేము పంచుకుంటాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము" అని ముఖ్యమంత్రి బఘేల్ ట్వీట్ చేశారు.

ఈ సంఘటనలో 1.రామ్‌కుమార్ యాదవ్ - హెడ్ కానిస్టేబుల్

2. టికేశ్వర్ ధ్రువ్ - అసిస్టెంట్ కానిస్టేబుల్ CAF, ధమ్తరి

3. సలిక్ రామ్ సిన్హా - కానిస్టేబుల్, కంకేర్

4. విక్రమ్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్

5. రాజేష్ సింగ్ - కానిస్టేబుల్ (ఘాజీపూర్, యుపి)

6. రవి పటేల్ - కానిస్టేబుల్

7. అర్జున్ రాజ్‌భర్, కానిస్టేబుల్ (CAF) లు మరణించారు. మరణించిన వారిలో మరో నలుగురి పేర్లు తెలియాల్సి ఉంది.

First Published:  26 April 2023 11:18 AM GMT
Next Story