Telugu Global
National

జైభీమ్ మూవీ పై ఎఫ్ ఐఆర్ ను రద్దు చేసిన‌ హైకోర్టు

జై భీం మూవీపై నమోదైన ఎఫ్ ఐ ఆర్ ను రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మూవీలో తమ కులాన్ని కించపర్చారంటూ వన్నియార్ కులస్తులు ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు.

జైభీమ్ మూవీ పై ఎఫ్ ఐఆర్ ను రద్దు చేసిన‌ హైకోర్టు
X

ఓటీటీ లో సంచలనం సృష్టించిన జై భీం మూవీపై వివాదాలు కూడా ముసురుకున్నాయి. ఓటీటీలో నెంబర్ 1 ట్రెండింగ్ లో నడిచిన ఆ మూవీ తమ కుల మనోభావాలను కించపరిచిందని ఆరోపిస్తూ వన్నియార్ కమ్యూనిటీ కేసు నమోదు చేసింది. రుద్ర వన్నియార్ సేనకు చెందిన న్యాయవాది కె. సంతోష్ పిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ పిర్యాదులో నటుడు సూర్య, జై భీం దర్శకుడు టీజే జ్ఞానవేల్ పై ఆరోపణలు చేశారు.

అయితే న్యాయవాది కె. సంతోష్ తమపై ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను కొట్టివేయాలని కోరుతూ జ్ఞానవేల్, సూర్య హైకోర్టు ను ఆశ్రయించారు.

వీళ్ళద్దరి తరపున వాదనలను వినిపించిన లాయర్ ఈ చిత్రం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె. చంద్రు న్యాయవాదిగా ఉన్నప్పుడు నిర్వహించిన కేసు ఆధారంగా రూపొందించబడిందని, అతని పేరు, మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పెరుమాల్సామి పేరు తప్ప, సినిమాలో మిగిలిన అన్ని పాత్రల పేర్లు మార్చామని తెలిపారు. .

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికేట్ ఇచ్చింది.ఈ మూవీ ఓవర్ ది టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లో మాత్రమే విడుదల చేయబడింది, అందువల్ల‌ దీన్ని వీక్షించే ప్రేక్షకుల సంఖ్య పరిమితం అయ్యింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా ఈ మూవీ చూసి అది అందించిన సందేశాన్ని అభినందించారు.

ఇది కులం, కమ్యూనిటీ , మతం ఆధారంగా ఎటువంటి భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరి ఆదరణ పొందింది. అంతే కాక‌ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, JFW అవార్డు,బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుతో సహా అనేక జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అని పిటిషన్ దారులు కోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న జస్టిస్ ఎన్. సతీష్ కుమార్ సూర్య, జ్ఞానవేల్ ల పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చారు.

First Published:  11 Aug 2022 12:03 PM GMT
Next Story