Telugu Global
NEWS

Chiranjeevi | చిరంజీవికి ఢిల్లీలో శ‌స్త్ర చికిత్స‌

Chiranjeevi | ప్రస్తుతం ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారని, నాలుగైదు రోజుల్లో హైదరాబాదుకు తిరిగి వ‌స్తార‌ని తెలుస్తోంది.

Chiranjeevi | చిరంజీవికి ఢిల్లీలో శ‌స్త్ర చికిత్స‌
X

మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీలో శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇటీవ‌ల మోకాలిలో త‌ర‌చూ నొప్పి వ‌స్తుండ‌టంతో ఆయ‌న ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ఆస్ప‌త్రిలో ఆయ‌న చికిత్స చేయించుకున్నారు.

అయితే ఎలాంటి కోతా లేకుండానే ఆర్థ్రోస్కోపిక్ విధానంలో మోకాలిలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారని, నాలుగైదు రోజుల్లో హైదరాబాదుకు తిరిగి వ‌స్తార‌ని తెలుస్తోంది.

ఆగ‌స్టు 22న చిరంజీవి పుట్టిన‌రోజు ఉండ‌టంతో ఆ స‌మ‌యానికి ఆయ‌న హైద‌రాబాదుకు వ‌స్తార‌ని స‌మాచారం. అయితే పుట్టిన‌రోజు వేడుక‌ల కోసం అభిమానుల‌కు అందుబాటులో ఉంటారా లేక విశ్రాంతి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

ఇటీవ‌ల విడుద‌లైన త‌న `భోళాశంక‌ర్‌` చిత్రంలో చిరంజీవి డ్యాన్సులు, స్టెప్పులు వేసి అభిమానుల‌ను అల‌రించిన విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల మోకాలికి సంబంధించి చిన్న స‌మ‌స్య ఉండటాన్ని గుర్తించిన ఆయ‌న భోళాశంక‌ర్ విడుద‌ల అనంత‌రం ఢిల్లీకి వెళ్లి శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయ‌న తిరిగి వ‌చ్చిన త‌ర్వాత త‌న కొత్త చిత్రానికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశ‌ముంది.

First Published:  16 Aug 2023 2:26 AM GMT
Next Story