Telugu Global
NEWS

జగన్‌, మహేష్‌బాబు.. ఇంట్రెస్టింగ్‌గా నమ్రతా ఇన్‌స్టా స్టోరీ!

17 నిమిషాల పాటు ఈ వీడియో నమ్రతా ఆఫిషియల్‌ అకౌంట్‌లో స్టోరీగా కనబడింది. అయితే వెంటనే స్టోరీ నుంచి ఈ వీడియోను నమ్రతా తొలగించినట్లుగా తెలుస్తోంది. అప్పటికే కొంతమంది రికార్డు చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మార్చారు.

జగన్‌, మహేష్‌బాబు.. ఇంట్రెస్టింగ్‌గా నమ్రతా ఇన్‌స్టా స్టోరీ!
X

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు గుంటూరు కారం సినిమా శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహేష్‌బాబు సతీమణి నమ్రత ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఎదురొచ్చే గాలి..ఎగరేస్తున్న చొక్కాపై గుండి అనే సాంగ్‌ను మహేష్‌బాబు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ వీడియోలతో ఎడిట్‌ చేశారు. అయితే ఈ వీడియోను నమ్రతా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. 17 నిమిషాల పాటు ఈ వీడియో నమ్రతా ఆఫిషియల్‌ అకౌంట్‌లో స్టోరీగా కనబడింది. అయితే వెంటనే స్టోరీ నుంచి ఈ వీడియోను నమ్రతా తొలగించినట్లుగా తెలుస్తోంది. అప్పటికే కొంతమంది రికార్డు చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మార్చారు.

ఇక సినిమాలోనూ ఓ ఫోటో వైరల్‌ అయింది. సినిమాలో మహేష్‌బాబు పక్కన ఉన్న నటుడి మెడలో JDP పార్టీ పేరుతో కండువా ఉండడం కూడా చర్చకు దారి తీసింది. జనసేన, తెలుగుదేశం పార్టీల‌ను ఉద్దేశించే ఇలా చేశారన్న చర్చ కూడా సోషల్‌ మీడియాలో నడిచింది. సూపర్‌ స్టార్ కృష్ణ ఫ్యామిలీ మొదటి నుంచి వైసీపీ ఫేవర్‌గానే ఉంది. గతంలో వైఎస్‌ ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు సన్నిహితంగా మెలిగింది. గతంలో కాంగ్రెస్‌ నుంచి కృష్ణ ఎంపీగా కూడా గెలిచారు.

First Published:  12 Jan 2024 3:53 PM GMT
Next Story