Telugu Global
NEWS

లీడర్‌‌షిప్ క్వాలిటీస్ ఇలా పెంచుకోవచ్చు!

లీడర్ కు ఉండాల్సిన మరో లక్షణం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండడం. మారుతున్న సమయం, సందర్భాలను అనుసరించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తుంటే మీరూ లీడర్ కాగలరు.

లీడర్‌‌షిప్ క్వాలిటీస్ ఇలా పెంచుకోవచ్చు!
X

జీవితంలోనైనా, కెరీర్‌‌లోనైనా సక్సెస్ అవ్వాలంటే లీడర్‌‌షిప్ క్వాలిటీస్ ఉండడం అవసరం. మరి ఈ నైపుణ్యాల కోసం ఏం చేయాలి..? లీడర్‌‌షిప్ క్వాలిటీస్ పెంపొందించుకునేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లీడర్‌‌షిప్ అంటే నలుగురిని లీడ్ చేయగలగడం. మీ చుట్టూ ఉన్నవాళ్లను ఎప్పటికప్పుడు ఇన్‌స్పైర్ చేస్తూ ఉండడం. అన్ని పరిస్థితులను తట్టుకుంటూ నిలబడి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలగడం. ఇలాంటి ధృఢమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నవాళ్లే లీడర్‌‌గా రాణించగలుగుతారు. వీటితోపాటు లీడర్‌‌కు ఎలాంటి లక్షణాలు ఉండాలంటే..

కమ్యూనికేషన్ అనేది లీడర్‌‌షిప్ క్వాలిటీస్‌లో ముఖ్యమైంది. లీడర్ అనే వాడు సరిగ్గా కమ్యూనికేట్ చేయగలగాలి. ఇతరుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, అందరికి నచ్చేలా సున్నితంగా, స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుంటే ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా లీడర్‌‌గా రాణించొచ్చు.

లీడర్ కు ఉండాల్సిన మరో లక్షణం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండడం. మారుతున్న సమయం, సందర్భాలను అనుసరించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తుంటే మీరూ లీడర్ కాగలరు.

లీడర్‌‌షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవడం కోసం ముందుగా మీ బలాలు ఏంటో తెలుసుకోవాలి. వాటిని ఎలా పదును పెట్టాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలి. అలాగే మీ బలహీనతలను అధిగమించడం కూడా అలవాటు చేసుకోవాలి.

లీడర్ ఎప్పుడూ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. ఒక నిర్ధిష్టమైన రూల్స్ పెట్టుకోకుండా సమయానికి తగ్గట్టు ప్రవర్తించగలగాలి.

ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని ఎలాగైనా సాధించాలన్న పట్టుదల ఉంటే లీడర్‌‌షిప్ క్వాలిటీస్‌ను ఆటోమేటిక్‌గా హ్యాక్ చేయొచ్చు. ఏదైనా కష్టతరమైన గోల్ ఉన్నప్పుడు దాన్ని చేరుకోవడానికి కమ్యూనికేషన్‌, కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌, డెసిషన్ మేకింగ్, క్రిటికల్‌ థింకింగ్‌.. ఇలా అన్నిరకాల లక్షణాలను పెంపొందించుకోవాల్సి వస్తుంది.

ఇకపోతే లీడర్‌‌కు ఒక ఇన్‌స్పిరేషన్ ఉండడం కూడా మంచిదే. లీడర్‌‌షిప్‌లో రకరకాల స్టైల్స్ ఉంటాయి. రకరకాల రంగాల్లో సక్సెస్ అయిన గొప్ప వ్యక్తుల వ్యక్తిత్వాలను పరిశీలించడం ద్వారా సొంతంగా లీడర్‌‌షిప్ స్టైల్‌ను పెంపొందించుకోవచ్చు.

First Published:  25 Jan 2024 8:59 AM GMT
Next Story