Telugu Global
NEWS

Acer EV Scooter MUVI 125 4G | లాప్‌టాప్స్ టు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. ఎసెర్ నుంచి ఈవీ స్కూట‌ర్ ఎంయూవీఐ 125 4జీ

ఎసెర్ ఎంయూవీఐ 125 4జీ ఈ-స్కూట‌ర్ ధ‌ర భార‌త్ మార్కెట్‌లో రూ.99,999(ఎక్స్ షోరూమ్‌)గా నిర్ణ‌యించారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఫేమ్‌-2 (FAME-2) ప‌థ‌కం కింద స‌బ్సిడీ పొంద‌నున్న‌ది. త‌ద్వారా సేల్స్ పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Acer EV Scooter MUVI 125 4G | లాప్‌టాప్స్ టు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. ఎసెర్ నుంచి ఈవీ స్కూట‌ర్ ఎంయూవీఐ 125 4జీ
X

Acer EV Scooter MUVI 125 4G | తైవాన్ కేంద్రంగా ప‌ని చేస్తున్న లాప్‌టాప్ త‌యారీ సంస్థ ఎసెర్ (Acer).. ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల త‌యారీలోకి అడుగుపెట్టింది. తాజాగా భార‌త్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌ను ఆవిష్క‌రించింది. ఎంయూవీఐ 125 4జీ (MUVI 125 4G) పేరుతో డిజైన్ చేసిన ఈ-స్కూట‌ర్ సింగిల్ చార్జింగ్‌తో 80 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తుంది. ఈ ఎంయూవీఐ 125 4జీ (MUVI 125 4G) స్కూట‌ర్‌ను భార‌త్‌లో ఎసెర్ ఈవీ లైసెన్స్‌డ్ కంపెనీ - ఇండియ‌న్ ఈవీ స్టార్ట‌ప్ ఈ-బైక్ గో(eBikeGo) త‌యారు చేయ‌నున్న‌ది. ఈ -సైకిల్‌, ఈ-బైక్ మాదిరిగానే స‌మీప భ‌విష్య‌త్‌లో ప‌లు ఈవీ టూ వీల‌ర్లు, ఈ-త్రీ వీల‌ర్ల త‌యారీకి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు ఈబైక్ గో(eBikeGo) సీఈఓ డాక్ట‌ర్ ఇర్ఫాన్ ఖాన్(Dr. Irfan Khan) తెలిపారు.

ఎసెర్ ఎంయూవీఐ 125 4జీ ఈ-స్కూట‌ర్ ధ‌ర భార‌త్ మార్కెట్‌లో రూ.99,999(ఎక్స్ షోరూమ్‌)గా నిర్ణ‌యించారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఫేమ్‌-2 (FAME-2) ప‌థ‌కం కింద స‌బ్సిడీ పొంద‌నున్న‌ది. త‌ద్వారా సేల్స్ పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఎసెర్ ఎంయూవీఐ 125 4జీ ఈ స్కూట‌ర్ ప్రీ-బుకింగ్స్ త్వ‌ర‌లో ప్రారంభమ‌వుతాయి. రూ.999 పే చేసి ప్రీ-బుకింగ్స్ చేసుకోవ‌చ్చు. మిగ‌తా రూ.99 వేలు డెలివ‌రీ టైంలో పే చేయాల్సి ఉంటుంది. రూ.999 రీఫండ‌బుల్ కూడా. అధికారిక డీల‌ర్ల ద్వారా ఆర్డ‌ర్లు స్వీక‌రిస్తారు. రూ.ల‌క్ష లోపు ధ‌ర‌కు అందుబాటులో ఉన్నఎసెర్ ఎంయూవీఐ 125 4జీ (MUVI 125 4G).. ఇప్ప‌టికే భార‌త్ మార్కెట్లో ఉన్న ఓలా ఎస్‌1 ఎక్స్‌, ప్యూర్ ఈవీ, ఎథేర్ ఎన‌ర్జీ 450 ఎస్‌, హీరో ఎల‌క్ట్రిక్‌, ఒకినావా, ఒకాయా, జాయ్ త‌దిత‌ర ఈ - స్కూట‌ర్ల‌తో పోటీ ప‌డ‌నుంది. ప‌ట్ట‌ణాల్లో ప్ర‌యాణించేవారికి భ‌విష్య‌త్ ఎల‌క్ట్రిక్ మొబిలిటీ ఎల‌క్ట్రిక్ మొబిలిటీ సొల్యూష‌న్‌గా ఎసెర్‌, ఈబైక్ గో అభివ‌ర్ణించాయి.

ఎసెర్ ఎంయూవీఐ 125 4జీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఫ్రంట్‌లో రౌండ్ షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, లైట్ వెయిట్ చేసిస్‌, 16-అంగుళాల 7-స్పోక్ అల్లాయ్ వీల్స్‌, క‌స్ట‌మైజ‌బుల్ డిజైన్డ్ ఫీచ‌ర్లు అండ్ క‌నెక్టెడ్ టెక్నాల‌జీ, రెండు వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. బ్లూటూత్ ఎనేబుల్డ్ 4-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ విత్ త్రీ కాన్ఫిగ‌రేష‌న్స్‌, ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ బేస్డ్ స్మార్ట్ ఫోన్ల‌తో రైడ‌ర్ల‌కు అనువుగా ఉంటుంది.

కంఫ‌ర్ట‌బుల్ రైడింగ్ కోసం ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, రేర్‌లో మోనోషాక్ అబ్జార్బ‌ర్ ఉంటాయి. ఈ స్కూట‌ర్ మూడు రంగుల్లో ల‌భిస్తుంది. పొలార్ వైట్‌, కార్బ‌న్ బ్లాక్‌, గ్లాసియ‌ర్ సిల్వ‌ర్ క‌ల‌ర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. తేలిగ్గా చార్జింగ్ చేయ‌డానికి వీలుగా స్వాప‌బుల్ బ్యాట‌రీలు అందిస్తుంది. గంట‌కు 75 కి.మీ వేగంతో ప్ర‌యాణించే కెపాసిటీ దీని సొంతం. ఈ ఈ-స్కూట‌ర్ పూర్తి స్థాయిలో చార్జింగ్ కావ‌డానికి నాలుగు గంట‌లు ప‌డుతుంది.


First Published:  17 Oct 2023 8:47 AM GMT
Next Story