Telugu Global
NEWS

అట్లీ, అల్లు అర్జున్‌.. క్రేజీ కాంబినేష‌న్ సెట్ అవుతోందా!

గురువారం జ‌వాన్ -2 రిలీజ్ కానున్న సంద‌ర్భంగా మీడియాతో అట్లీ మాట్లాడారు. జాతీయ అవార్డు హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నారా..? అని ప్ర‌శ్నిస్తే బ‌న్నీకి క‌థ చెప్పాన‌ని ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.

అట్లీ, అల్లు అర్జున్‌.. క్రేజీ కాంబినేష‌న్ సెట్ అవుతోందా!
X

జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు గెలుచుకొని ఉత్సాహంతో ఊపు మీదున్న అల్లు అర్జున్ పుష్ప‌-2 ద రూల్ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఆ త‌ర్వాత సినిమాను బ‌న్నీ.. కోలీవుడ్ సూప‌ర్ డైరెక్ట‌ర్ అట్లీతో చేయ‌బోతున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది నిజ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని తాజాగా అట్లీ చేసిన కామెంట్ల‌తో తెలుస్తోంది.

షారుఖ్ హీరోగా జ‌వాన్‌-2

తమిళ్ స్టార్ హీరో విజయ్‌తో తెరి, బిగిల్‌ లాంటి సినిమాలు తీసిన అట్లీకి కోలీవుడ్‌లో పిచ్చ క్రేజ్ వ‌చ్చింది. అక్క‌డి నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అట్లీ ఏకంగా కింగ్ ఖాన్‌తో సినిమా తీశాడు. షారుఖ్ హీరోగా అట్లీ తెర‌కెక్కించిన జవాన్ -2 ఈరోజే రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా హిట్ అవుతుంద‌ని అటు షారుఖ్‌, ఇటు అట్లీ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇది హిట్ట‌యితే అట్లీ పేరు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తుంది.

బ‌న్నీకి క‌థ చెప్పా

గురువారం జ‌వాన్ -2 రిలీజ్ కానున్న సంద‌ర్భంగా మీడియాతో అట్లీ మాట్లాడారు. జాతీయ అవార్డు హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నారా..? అని ప్ర‌శ్నిస్తే బ‌న్నీకి క‌థ చెప్పాన‌ని ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. త్వ‌ర‌లో గుడ్ న్యూస్ చెబుతాన‌ని కూడా అన్నారు. అంటే అట్లీ, అల్లు అర్జున్‌ల క్రేజీ కాంబో సెట్ అవుతున్న‌ట్లే క‌నిపిస్తోంది.

First Published:  7 Sep 2023 3:45 AM GMT
Next Story