Telugu Global
NEWS

ఐఓఎస్ 17లోని అద్భుతమైన ఈ ఫీచర్లు తెలుసా?

ఐఓఎస్ 17లో గతంలో లేని కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లతో పాటు డైలీ యూజ్‌కు తగ్గట్టు కొన్ని ప్రొడక్టివ్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐఓఎస్ 17లోని అద్భుతమైన ఈ ఫీచర్లు తెలుసా?
X

రీసెంట్‌గా లాంఛ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు సేల్‌కు రెడీ అయ్యాయి. లేటేస్ట్ ఐఫోన్లు, యాపిల్‌ వాచ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న పలు స్టోర్స్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా ఐఫోన్ 15 సిరీస్‌లో ఉన్న లేటెస్ట్ ఐఓఎస్ 17 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఓఎస్ 17లో గతంలో లేని కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లతో పాటు డైలీ యూజ్‌కు తగ్గట్టు కొన్ని ప్రొడక్టివ్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే..

వీడియో మెసేజెస్‌

అవతలివాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు అత్యవసరమైన వీడియో మెసేజ్‌ను పంపేందుకు గానూ ఐఓఎస్ 17లో ఫేస్‌టైమ్‌ వీడియో మెసేజెస్‌ ఫీచర్‌ ఉంది. కాల్‌ చేసినప్పుడే రికార్డ్‌ వీడియో బటన్‌ నొక్కి వీడియో మెసేజ్ పంపొచ్చు. ఇది అవతలి వాళ్ల ఫేస్‌టైమ్‌ యాప్‌లో కనిపిస్తుంది.

ఓటీపీ ఆటో డిలీట్

టు- ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ఉన్న యాప్స్ వాడినప్పుడు లేదా ఇతర సందర్భాల్లో రకరకాల కోడ్స్ లేదా ఓటీపీలు వస్తుంటాయి. వీటితో పది నిమిషాలకు మించి పని ఉండదు. కాబట్టి ఇలాంటి మెసేజ్‌లు ఆటోమెటిక్‌గా డిలీట్ అయ్యేలా ఐఓఎస్ 17 కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

ఆఫ్‌లైన్‌ మ్యాప్స్‌

ఐఫోన్స్‌లో యాపిల్‌ మ్యాప్స్‌ వాడుకోవాలంటే ఇంటర్నెట్‌ కనెక్షన్ ఉండాల్సిందే. అయితే ఐఓఎస్ 17 లో ఆ ప్రాబ్లమ్ లేదు. మ్యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు.

స్క్రీన్‌ డిస్టెన్స్

ఫోన్‌ స్క్రీన్‌ను ముఖానికి 12 అంగుళాల దూరంలో ఉంచుకుంటే కళ్లకు మంచిది. యూజర్లు దీన్ని అమలుచేయడానికి ఐఓఎస్ 17లో స్క్రీన్‌ డిస్టెన్స్‌ ఫీచర్‌ ఉంది. ఫోన్‌ స్క్రీన్ ముఖానికి మరీ దగ్గరికి వచ్చినప్పుడూ ఈ ఫీచర్ హెచ్చరిస్తుంది.

వాయిస్‌ మెయిల్‌ టు టెక్స్ట్

ఎవరైనా వాయిస్‌ మెయిల్‌ పంపినప్పుడు అందులోని సమాచారం అప్పటికప్పుడు టెక్స్ట్‌ రూపంలోకి కన్వర్ట్ అయ్యేలా ఐఓఎస్ 17 లో స్పెషల్ ఫీచర్ ఉంది. దీంతో ప్రతి వాయిస్ మెయిల్‌ను వినాల్సిన పనిలేకుండా స్క్రీన్‌పైనే చదువుకునే వీలుంటుంది.

కోడ్స్‌

దుస్తుల‌ మీద వాటిని ఉతికే విధానాన్ని తెలియజేయడానికి కొన్ని కోడ్స్ లాంటివి ఉంటాయి. ఐఓఎస్ 17తో ఆ కోడ్స్‌ను ఈజీగా డీకోడ్ చేయొచ్చు. కోడ్‌ని ఫొటో తీస్తే దాని వివరాలు స్క్రీన్‌పై వచ్చేస్తాయి. ఇవేకాకుండా ఎలాంటి విజువల్ కోడ్స్ అయినా ఈ టూల్‌తో డీకోడ్ చేయొచ్చు.

స్టికర్స్‌

నచ్చిన ఫొటోల‌ను స్టికర్‌గా మార్చుకునేందుకు ఐఓఎస్ 17లో ఇన్‌స్టంట్ టూల్ అందుబాటులో ఉంది. ఫొటోనే కాకుండా ఫొటోలోని వస్తువులను కూడా స్టికర్స్‌గా మార్చుకోవచ్చు. ఫొటో మీద నొక్కి యాడ్‌ స్టికర్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే స్టికర్ రెడీ.

First Published:  22 Sep 2023 11:14 AM GMT
Next Story