Telugu Global
NEWS

విజయేంద్రప్రసాద్ స్టోరీతో స్టార్ హీరో మూవీ

విజయేంద్రప్రసాద్ అందించిన కథతో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో బజరంగీ భాయిజాన్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

విజయేంద్రప్రసాద్ స్టోరీతో స్టార్ హీరో మూవీ
X

సీనియర్ సినీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారంటే చాలు అది కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. ఆయన కథతో తెరకెక్కిన మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కావడంతో ఆయన అందించే కథతో సినిమా చేసేందుకు అగ్ర హీరోలు ఆసక్తి చూపుతున్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరు అగ్ర హీరోలు తమకోసం కథ రాయాల్సిందిగా విజయేంద్ర ప్రసాద్‌ను కోరుతున్నారు.

విజయేంద్రప్రసాద్ అందించిన కథతో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో బజరంగీ భాయిజాన్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ విజయేంద్రప్రసాద్ ఇచ్చిన స్టోరీతో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తలైవి మూవీ చేసింది. ఇప్పుడు కన్నడ అగ్ర హీరో కిచ్చ సుదీప్ విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో నిర్మిస్తున్నట్లు ఈ మూవీని నిర్మిస్తున్న ఆర్సీ స్టూడియోస్ ప్రకటించింది. ఈ సినిమాకు ఆర్. చంద్రు దర్శకత్వం వహించనున్నాడు. చంద్రు - సుదీప్ కాంబినేషన్లో గత ఏడాది కబ్జా అనే మూవీ రాగా అది కన్నడలో సూపర్ హిట్ గా నిలిచింది. సుదీప్ గతంలో విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో తెరకెక్కిన ఈగ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమా విజయంతోనే ఇటు సౌత్, అటు నార్త్ లో సుదీప్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

First Published:  4 Sep 2023 2:28 PM GMT
Next Story